Jharkhand | విశ్వాసం నెగ్గిన జార్ఖండ్‌ సీఎం చంపై సొరేన్‌

జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ బల పరీక్షలో విజయం సాధించారు. చంపై సోరెన్ సర్కార్​కి వ్యతిరేకంగా 29 ఓట్లు పడగా అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి

  • Publish Date - February 5, 2024 / 09:10 AM IST

  • ప్రభు­త్వా­నికి 47 మంది సభ్యుల మద్దతు
  • వ్యతి­రే­కిం­చిన 29 మంది ఎమ్మె­ల్యేలు
  • మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌ హాజరు
  • కుంభ­కో­ణంలో నా పాత్ర రుజువు చేస్తే.. రాజ­కీ­యాలు వది­లేస్తా
  • కేంద్రా­నికి, ఈడీకి హేమంత్‌ సొరేన్‌ సవా

Jharkhand | విధాత‌: జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ బల పరీక్షలో విజయం సాధించారు. చంపై సోరెన్ సర్కార్​కి వ్యతిరేకంగా 29 ఓట్లు పడగా అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. బల పరీక్షకు కోర్టు అనుమ‌తితో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా హాజరయ్యారు. త‌న అరెస్టు వెనక రాజ్ భవన్ ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


ఎవ‌రీ చంపై సోరెన్..?


చంపై సోరెన్ ప్రముఖ గిరిజ‌న నాయ‌కుడు. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. 67 ఏండ్ల చంపై ప్ర‌స్తుతం జార్ఖండ్ గ‌వ‌ర్న‌మెంట్‌లో ర‌వాణా శాఖ మంత్రిగా కొన‌సాగుతున్నారు. సిరైకేలా – ఖ‌ర్స‌వాన్ జిల్లాలోని జిలిన్‌గోరా గ్రామంలో రైతు కుటుంబంలో జ‌న్మించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నారు. ప్ర‌త్యేక జార్ఖండ్ ఏర్పాటు కోసం జ‌రిగిన ఉద్య‌మంలో చంపై కీల‌క‌పాత్ర పోషించారు. దీంతో ఆయ‌న జార్ఖండ్ పులిగా ప్ర‌సిద్ధి చెందారు. ఇప్ప‌టికీ చంపైని జార్ఖండ్ పులిగా పిలుస్తుంటారు. ఇక జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రెసిడెంట్ శిబూ సోరెన్‌కు చంపై అత్యంత స‌న్నిహితుడు. శిబూ సోరెన్‌కు అన్ని వేళ‌లా అండ‌గా నిలిచారు.


రుజువు చేస్తే రాజ­కీ­యాలు వది­లేస్తా

ఈడీ కస్ట­డీలో ఉన్న మాజీ ముఖ్య­మంత్రి హేమంత్‌ సొరేన్‌ కూడా పీఎం­ఎ­ల్‌ఏ కోర్టు అను­మ­తితో సోమ­వారం నాటి విశ్వాస పరీ­క్షకు హాజ­ర­య్యారు. విశ్వాస తీర్మా­నంపై చర్చలో భాగంగా హేమంత్‌ మాట్లా­డుతూ.. భూముల కుంభ­కో­ణంలో తన పాత్రను రుజువు చేయా­లని కేంద్రం­లోని బీజేపీ సర్కా­రుకు, ఎన్‌­ఫో­ర్స్‌­మెంట్‌ డైరె­క్ట­రే­ట్‌కు ఆయన సవాలు విసి­రారు. ‘వారు కనుక నిరూ­పిం­చ­గ­లి­గితే.. నేను రాజ­కీయ వది­లే­స్తాను’ అని ప్రక­టిం­చారు.


1991లో రాజ‌కీయ ప్ర‌వేశం..

1991లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. సిరైకేలా నియోజ‌క‌వ‌ర్గానికి 1991లో ఉప ఎన్నిక‌లు రావ‌డంతో.. ఆ స్థానం నుంచి చంపై స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి, గెలుపొందారు. నాటి నుంచి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. 2005, 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లోనూ సిరైకేలా నుంచి గెలుపొందారు. 2009 నుంచి 2014 వ‌ర‌కు సైన్స్ అండ్ టెక్నాల‌జీ, కార్మిక‌, గృహ శాఖ మంత్రిగా కొన‌సాగారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో ర‌వాణా, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్నారు. చంపై సోరెన్‌కు యంగేజ్‌లోనే వివాహ‌మైంది. ఆయ‌న‌కు న‌లుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు సంతానం.

Latest News