- 50 మందికి ప్రయాణికులకు గాయాలు
- ఫ్లాట్ ఫారం సైడ్ వాల్‌ను ఢీకొట్టిన బోగీలు
విధాత: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకొనే క్రమంలో పట్టాలు తప్పింది. ఒక్కసారిగా కుదుపుకు గురై ప్లాట్‌ఫాం సైడ్ గోడలను ఢీకొట్టింది. మూడు బోగీలు పక్కకు ఒరిగాయి.ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
కొంతమందికి గుండెపోటు రావడంతో లాలాగూడ రైల్వే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రైలు ప్రమాదానికి గురికావడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కేకలువేస్తూ రైలు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు. అయితే స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తునందున భారీ ప్రమాదం తప్పింది.
పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది