Site icon vidhaatha

Asirgarh Fort: ఛావా సినిమా ఎఫెక్ట్.. బంగారం కోసం తవ్వకాలు!

Asirgarh Fort:

విధాత: చత్రపతి శివాజీ (Shivaji) తనయుడు శంభాజీ మహారాజ్ (Sambhaji Maharaj) జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ హీరోగా రూపొందించిన బాలీవుడ్ హిట్ మూవీ ఛావా (Chhaava) సినిమా దేశ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. అయితే సినిమాలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని బుర్హాన్ పూర్ (Burhanpur) ను బంగారు గనిగా.. శంభాజీ సైన్య స్థావరంగాచూపించారు. ఇదే పాయింట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ ప్రాంతంలో బంగారం లభిస్తుందన్న ఆశతో ప్రజలు ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. ఏకంగా స్థానిక అసిర్ గఢ్ (Asirgarh Fort) కోట వద్ధ బంగారం కోసం తవ్వకాలకు దిగారు. టార్చ్ లైట్లు, ఇనుప పనిముట్లు, మెటల్ డిటెక్టర్స్ తో స్థానికులు రాత్రిపూట కోట దగ్గర ఇష్టానుసారం తవ్వకాలకు దిగారు. కొందరు బంగారు నాణేలు దొరికాయని ప్రకటించడంతో.. ఆ ప్రాంతానికి రోజురోజుకీ జనాల తాకిడి పెరిగింది. అయితే పోలీసులకు, అధికారులకు ఈ విషయమై సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు చెబుతున్నారు.

బుర్హాన్ పూర్ గతంలో మొఘలుల నగరంగా విలసిల్లింది. ఆ కాలంలో అప్పటి ప్రజలు యుద్ధాలు, దొంగలకు భయపడి తమ వద్ద ఉన్న బంగారం, ఇతర విలువైన వస్తువుల్ని మట్టిలో పాతి పెట్టేవాళ్లని..అలా పాతిపెట్టిన నాణేలు అప్పుడప్పుడు తవ్వకాల్లో బయటపడ్డాయంటున్నారు చరిత్రకారులు. ఇటీవల అసిర్ గఢ్ కోటకు దగ్గర్లో ఉన్న జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరుగుతుండగా.. అక్కడ ఉన్న దర్గా దగ్గర తవ్వకాలు జరిపిన ఓ జేసీబీ మిషన్.. ఆ మట్టిని స్థానికంగా ఉన్న ఓ రైతు పొలంలో పోశారు . అయితే కూలీలు ఆ మట్టి నుంచి పాత నాణేలు గుర్తించరాని, అందులో బంగారం, వెండి నాణేలు ఉన్నాయని ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారానికి తోడు ఛావా సినిమాలో ఈ ప్రాంతం బంగారు గనిగా పేర్కోనడంతో ప్రజలు ఇక్కడ బంగారమో.. నాణేలు దొరకవచ్చన్న ఆశతో తవ్వకాలకు పాల్పడుతున్నారు. కాగా ప్రజలు ఇష్ట్రారాజ్యంగా తవ్వాకాలు సాగించకుండా తక్షణమే ఆ ప్రాంతానికి రక్షణ కల్పించాలని పురావస్తు శాఖ అధికారులు స్థానిక యంత్రాంగాన్ని కోరుతున్నారు. దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి.. ఆ ప్రాంతంలో సిబ్బందిని మోహరింపజేశారు. ఇష్టానుసారం తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 

Exit mobile version