మహారాష్ట్ర సీఎం షిండే ప్రాణాలకు ముప్పు!.. నిఘా వర్గాలు అప్రమత్తం
విధాత: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు పసిగట్టాయి. షిండే ప్రాణాలకు ముప్పు ఉందని శనివారం సాయంత్రం మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కు నిర్దిష్ట సమాచారం అందింది. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా స్టేట్ ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్ దూంబ్రే మాట్లాడుతూ.. పక్కా సమాచారం అందడంతో సీఎం షిండే భద్రతా చర్యలపై సమీక్షించామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతకు అదనంగా మరింత భద్రతను పెంచామని […]

విధాత: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు పసిగట్టాయి. షిండే ప్రాణాలకు ముప్పు ఉందని శనివారం సాయంత్రం మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కు నిర్దిష్ట సమాచారం అందింది. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ఈ సందర్భంగా స్టేట్ ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్ దూంబ్రే మాట్లాడుతూ.. పక్కా సమాచారం అందడంతో సీఎం షిండే భద్రతా చర్యలపై సమీక్షించామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతకు అదనంగా మరింత భద్రతను పెంచామని స్పష్టం చేశారు.
థానేలోని ఆయన నివాసంతో పాటు ముంబైలోని అధికారిక నివాసం వర్షలోనూ భద్రతను కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. అక్టోబర్ 5న ముంబైలోని ఎఎంఆర్డీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించే దసరా ర్యాలీలో సీఎం షిండే పాల్గొననున్నట్లు తెలిపారు.
అయితే గతంలో తాను మంత్రిగా కొనసాగిన సమయంలో గడ్చిరోలి జిల్లాకు ఇంచార్జి మంత్రిగా షిండే వ్యవహరించారు. అర్బన్ డెవలప్‌మెంట్‌గా కొనసాగుతున్న సమయంలో గతేడాది అక్టోబర్‌లో నక్సలైట్ల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. చంపేస్తామని లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.