CM KCR | గజ్వేల్‌ టూ కామారెడ్డి.. షిప్ట్‌ అవుతున్న సీఎం కేసీఆర్‌?

CM KCR పూర్వీకుల గ్రామం కామారెడ్డిలోని పోసానిపల్లి కావడంతో… ఇప్పటికే పలువురు నేతలకు సీఎం కేసీఆర్‌ ఫోన్ (కంది, శ్రీనివాస్ రెడ్డి) విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌కు బదులుగా కామారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రగతి భవన్‌ వేదికగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మెదక్‌ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ విషయాన్నిధృవీకరిస్తున్నారు. […]

  • Publish Date - July 18, 2023 / 04:48 PM IST

CM KCR

  • పూర్వీకుల గ్రామం కామారెడ్డిలోని పోసానిపల్లి కావడంతో…
  • ఇప్పటికే పలువురు నేతలకు సీఎం కేసీఆర్‌ ఫోన్

(కంది, శ్రీనివాస్ రెడ్డి)
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌కు బదులుగా కామారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రగతి భవన్‌ వేదికగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మెదక్‌ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ విషయాన్నిధృవీకరిస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం బీఆర్ ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పార్టీ ముఖ్య నేతలతో డాడీ కామారెడ్డి నుండి పోటీ చేస్తారని చెప్పినట్లు తెలిసింది.

నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 33 అసెంబ్లీ , 4 పార్లమెంట్ స్థానాలపై ప్రభావం చూపుతుందని భావించిన సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు పార్టీకి చెందిన పలువురు నేతలు చెపుతున్నారు. ఈ మేరకు ప్రతేక దృష్టి కేంద్రీకరించాలని కేటీఆర్, హరీశ్‌రావు లను ఆదేశించిన కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో బీఆర్ ఎస్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని వచ్చిన సర్వే నివేదికలతో ఆలోటును భర్తీ చేయడానికే కేసీఆర్‌ సరికొత్త ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టారని పార్టీ నేత ఒకరు అన్నారు. కామారెడ్డిలో పోటీ వ్యూహంలో భాగంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలైన ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌ రహస్యంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

సొంతూరు సెంటిమెంట్‌

సీఎం కేసీఆర్‌ పూర్వీకుల స్వగ్రామం కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం దోమకొండ మండలం పోసానిపల్లే. ప్రస్తుతం దీనిని కొనాపూర్ గా పిలుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యాం నిర్మాణంతో సొంతూరు ముంపుకు గురవ్వగా, కేసీఆర్‌ కుటుంబం ఆ నాడు సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి వలస వచ్చింది. ఈ విషయాన్నే కేటీఆర్ కామారెడ్డి పర్యటనలో స్వయంగా వెల్లడించారు.

దీంతో సీఎం కేసీఆర్‌ ఇక్కడి నుంచే పోటీ చేయడం దాదాపు ఖాయమని స్థానిక నేతలు అంటున్నారు. ఇక్కడ పోటీ చేస్తే కేసీఆర్‌కు సొంతూరు సెంటిమెంట్‌ కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఒకేసారి ఎన్నికలు వస్తే…

పార్లమెంట్‌ కు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగితే సీఎం కేసీఆర్‌ కామారెడ్డి అసెంబ్లీ తో పాటు మెదక్ పార్లమెంటుకూ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా బీఆర్ ఎస్‌ పార్టీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల బీజేపీ, కాంగ్రెస్ చోటామోటా లీడర్లతో పాటు నియోజక వర్గ, జిల్లా లీడర్లతో మాట్లాడేందుకు మంత్రి హరీశ్‌ రావు, కేటీఆర్ లకు సీఎం కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

Latest News