Congress
విధాత: బీఆర్ఎస్, బీజేపీల పరస్పర ఒప్పందములో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని భట్టి విక్రమార్క అన్నారు. వరంగల్ లో ప్రధాని మోడీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై చేసిన విమర్శలపై భట్టి స్పంందిస్తు మోడీ పర్యటనతో తెలంగాణకు ఉపయోగం లేదన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. చర్యలు తీసుకోలేదంటే మోడీ అసమర్ధుడని భావించాల్సి వస్తుందన్నారు. సంజయ్, కేటీఆర్ ఢిల్లీ వెళ్లి డీల్‌పై చర్చించిన తర్వాతే బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించారన్నారు.
రాహుల్ తమ నాయకుడని ఆయన్ని ఏ హోదాలో వస్తారని ప్రశ్నించడం సరికాదన్నారు. కోట్లకు పడగలెత్తిన రాష్ట్ర పాలకులు తెలంగాణకు న్యాయం చేయలేకపోయారన్నారు. ప్రజల సంక్షేమానికి అడ్డుగా ఉన్న వారిని తొలగించాలన్నారు.
భూస్వామ్య బీఆర్‌ఎస్‌ను రాష్ట్రం నుండి తరిమికొట్టాలన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని భావిస్తున్నారన్నారు. మోడీ, కేసీఆర్ కలిసి దేశ, రాష్ట్ర వనరులను దోచుకుంటునారన్నారు. అంతకుముందు ఎంపీ కేవిపీ తో కలిసి వైయస్సార్ విగ్రహం వద్ద జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.