Site icon vidhaatha

DSP: మరదలితో.. దేవిశ్రీ ప్రసాద్‌ పెళ్లి నిజమేనా?

విధాత‌, సిన‌మా: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నాడని మరిచిపోవద్దు. ఎంత మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాత్రం.. ఆయనకి కూడా పెళ్లి కాలేదు. దాదాపు 43 సంవత్సరాలు వచ్చేశాయ్. ఇంకా పెళ్లి కాలేదంటే.. నలుగురు ఏదో ఒకటి అనుకుంటారుగా.

అలా అనుకుంటారనే.. అప్పుడప్పుడు ఏదో ఒక హీరోయిన్‌తోనో, సింగర్‌తోనో పెళ్లి అనేలా రూమర్స్ వచ్చేలా దేవిశ్రీ ప్లాన్ చేస్తుంటాడు. మరి అతను కావాలని చేస్తాడో.. లేదంటే నిజంగా అలా జరుగుతుందో తెలియదు కానీ.. ఇప్పటి వరకు ఈ లిస్ట్‌లోకి ఛార్మీ, పూజిత పొన్నాడ వంటి హీరోయిన్స్‌తో పాటు పలు సింగర్స్ పేర్లు కూడా వినిపించాయి. కానీ.. ఏ ఒక్కరితోనూ కలిసి ఏడడుగులు వేయలేదు దేవిశ్రీ.

మధ్యలో హీరో అవుతాడంటూ.. సుకుమార్, దిల్ రాజుల పేర్లు వినిపించాయి. హీరో కూడా కాలేదు. ఈ మధ్య సంగీతం పరంగానూ కాస్త వెనుక పడినట్లుగా అనిపించింది. థమన్ ఫుల్ ఫామ్‌లో దూసుకెళుతుంటే.. దేవిశ్రీ మాత్రం చూద్దాంలే అన్నట్లుగా సినిమాలు చేస్తున్నాడు.

అలా వెళుతున్న దేవిశ్రీని మళ్లీ నిలబెట్టింది మాత్రం ‘పుష్ప’ చిత్రమనే చెప్పుకోవాలి. ఆ సినిమాతో దేవిశ్రీ అంటే ఏంటో మరోసారి.. ప్రపంచానికి తెలిసింది. మళ్లీ రాక్‌స్టార్ ఫామ్‌లోకి వచ్చాడనేలా.. అనిపించుకున్న తర్వాత మరోసారి వరుస చిత్రాలతో దేవిశ్రీ బిజీ అయ్యాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత.. దేవిశ్రీ పెళ్లికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

దేవిశ్రీ ప్రసాద్.. దూరపు బంధువు, మరదలి వరస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా రెండు రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దేవిశ్రీ‌ని ఈ విషయంపై సంప్రదిస్తే మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నాడు.

ఏమీ లేకపోతే ఇలా వార్తలెందుకు వస్తున్నాయో ఆయనకే తెలియాలి. ఒకవేళ నిజమైతే మాత్రం దేవిశ్రీ ఫ్యాన్స్‌, ఫ్యామిలీ‌కి ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఏదీ ఉండదు. చూద్దాం మరి.. దేవిశ్రీ బ్యాచ్‌లర్ బాణీ వదిలి.. వైవాహిక ట్యూన్ ఎప్పుడందుకుంటాడో?

Exit mobile version