Site icon vidhaatha

Dharmapuri Srinivas | డీఎస్‌ కుటుంబంలో చేరికల చిచ్చు.. నిన్న చేరిక ఇవాళ రాజీనామా

విధాత‌: బీఆర్ఎస్ మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కుటుంబంలో చేరికల చిచ్చు రేపింది. నిన్న ఆదివారం గాంధీభవన్ కి వెళ్లి కాంగ్రెస్లో చేరిన మరుసటి రోజునే పార్టీకి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని స్పష్టం చేసిన డీఎస్ తనను వివాదాల్లోకి లాగ వద్దని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ధర్మపురి విజయలక్ష్మి పేరుతో విడుదలైన‌ లేఖలో.. ‘‘ఇగో డీఎస్ గారి రాజీనామా ! ఇది రాజకీయాలు చేసే సమయం కాదు ! ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్దతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి.. మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకి చేతులు జోడించి దండం పెడుతున్న! ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి’’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరలేదని తన కొడుకు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా తాను గాంధీభవన్ కి వచ్చానని ఒకవేళ తాను కూడా పార్టీలో చేరినట్లు భావిస్తే ఈ లేఖ ద్వారా రాజీనామా చేసినట్లుగా భావించాలని కోరారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబంలో నెలకొన్న రాజకీయ విభేదాలతోనే ఆయన, ఆయన భార్య లేఖలు విడుదల చేసినట్లుగా తెలుస్తుంది.

Exit mobile version