Site icon vidhaatha

Liquor scam: కవిత కేసులో సుప్రీంను ఆశ్రయించిన ED

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కాం(Liquor scam)కు సంబంధించి తన విచారణపై కవిత (Kavitha) సుప్రీంకోర్టు (Supreme Court)లో వేసిన కేసులో ఈడీ (ED) కేవియట్ పిటిషన్ (Caveat Petition) దాఖలు చేసింది. కవిత కేసులో తమ వాదన వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని కోర్టును ఈడీ కోరింది.

కోర్టు ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయకుండా ఈడి కెవియట్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో ఈనెల 20న విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈనెల 24న కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఈడి కేవియట్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ప్రక్రియ కీలక దశకు చేరుకోగా, కస్టడీలో ఉన్న నిందితులతో పాటు కవితను మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఖచ్చితంగా విచారించాల్సిన అవసరమున్న నేపథ్యంలోఈడి కేవీయట్ పిటిషన్ ఆసక్తికరంగా మారింది.

Exit mobile version