మేడారం హుండీలో అంబేద్కర్‌ ఫోటోతో నకిలీ 100నోట్లు

మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. హన్మకొండ టీటీడీ కల్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. 518హుండీలను 350మంది సిబ్బంది లెక్కించడం ప్రారంభించారు

  • Publish Date - February 29, 2024 / 08:24 AM IST

విధాత : మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. హన్మకొండ టీటీడీ కల్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. 518హుండీలను 350మంది సిబ్బంది లెక్కించడం ప్రారంభించారు. దాదాపు 10రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ సాగనుందని అధికారులు తెలిపారు.


ముందుగా నోట్ల లెక్కింపు చేసి తర్వాతా నాణాలను లెక్కిస్తారు. తదుపరి బంగారు, వెండి సహా ఇతర కానుకల లెక్కింపు నిర్వహించనున్నారు. గత ఏడాది 12కోట్ల హుండీ ఆదాయం రాగా ఈ దఫా పెరిగిన భక్తుల సంఖ్య నేపథ్యంలో అంతకంటే ఎక్కువగానే వస్తుందని అంచనా వేస్తున్నారు.


కాగా హుండీలను తెరిచి లెక్కింపు చేపుడుతున్న సిబ్బందికి భక్తులు వేసిన రకరకాల కానుకలు, విదేశీ కరెన్సీ నోట్లు, నాణాలు లభిస్తున్నాయి. అలాగే భారత రత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లు కూడా లభించాయి. భారత కరెన్సీపై అంబేద్కర్‌ ఫోటోను ముద్రించాలన్న డిమాండ్‌తో ఆ నోట్లను వారు హుండీలో వేసినట్లుగా భావిస్తున్నారు.

Latest News