Film Chamber Elections | దిల్‌ రాజు Vs కల్యాణ్‌: తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ అధ్యక్షుడిగా దిల్ రాజు గెలుపు ..!

<p>Film Chamber Elections | ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో జరిగే ప్రతి ఎలక్షన్ కూడా రాజకీయ ఎలక్షన్స్ రేంజ్ ని తలపిస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. పోటీ దారులు అనేక హామీలు ఇస్తూ ఓట‌ర్స్‌ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌తంలో జ‌రిగిన మా ఎల‌క్ష‌న్స్ ఎంత హోరాహోరీగా సాగాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక ఈరోజు( జూలై 30) న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ రంజుగా సాగాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొద‌లు […]</p>

Film Chamber Elections |

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో జరిగే ప్రతి ఎలక్షన్ కూడా రాజకీయ ఎలక్షన్స్ రేంజ్ ని తలపిస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. పోటీ దారులు అనేక హామీలు ఇస్తూ ఓట‌ర్స్‌ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌తంలో జ‌రిగిన మా ఎల‌క్ష‌న్స్ ఎంత హోరాహోరీగా సాగాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇక ఈరోజు( జూలై 30) న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ రంజుగా సాగాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొద‌లు కాగా, మూడు గంటలకు ముగిసింది. ఇక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఆరు గంటలకు ఫలితాలు వెల్లడించారు

తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఎల‌క్ష‌న్స్ పోటీలో ప్ర‌ముఖ నిర్మాత‌లు సి.కళ్యాణ్‌, దిల్‌రాజు ప్యానెల్‌ మధ్య పోటీ జరిగింది. ఫిలిం చాంబర్‌లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా.. 900 మంది ఓటు హక్కును వినియోగించుకున్న‌ట్టు స‌మాచారం.

నాలుగు సెక్టార్‌లలోని సభ్యులు ఓట్లు వేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, ప్ర‌ముఖ‌ నటులు రాజేంద్ర ప్రసాద్, నాగినీడు, బెనర్జీ, అశోక కుమార్‌, నటి జీవితా రాజశేఖర్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సహా పలువురు నటీనటులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. ఈ పోటీలో తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు గెలిచారు‌..దిల్ రాజు ప్యానెల్ లో అడుగులు, సి. కళ్యాణ్ ప్యానెల్ లో ఐదుగురు గెలిచారు

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతాయన్న విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం నిర్మాతల మండలిలో తలెత్తిన వివాదాలను దృష్టిలో పెట్టుకొని ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ లో నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయారు.

దిల్ రాజు, మైత్రి అధినేతలు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు.. ఇలా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న నిర్మాతలంతా ఒకవైపు ఉంటే అడపాదడపా సినిమాలు తీసేవాళ్ళు మ‌రో వైపు ఉన్నారు. దీంతో ఈ సారి తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ మంచి రసవత్తరంగా మారాయి.మొత్తానికి దిల్ రాజు ప్యానెల్,..సి కళ్యాణ్ ప్యానెల్ పై విజయ దుందుభి మోగించారు..

Latest News