Site icon vidhaatha

Secundrabad | సికింద్రాబాద్‌లో ఘోరం.. బ‌ట్ట‌ల దుకాణంలో చెల‌రేగిన మంట‌లు

Secundrabad | సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పాలికాబ‌జార్‌లో మంట‌లు చెల‌రేగాయి. ధ‌మాకా సేల్ పేరుతో ఉన్న ఓ బ‌ట్ట‌ల దుకాణంలో ఆదివారం ఉద‌యం అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో స్థానికులు గ‌మ‌నించి, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

దీంతో హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది క‌లిసి మంట‌ల‌ను అదుపు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా అక్క‌డికి చేరుకుని ప‌రిస్థితిపై ఆరా తీస్తున్నారు.

షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింద‌ని దుకాణ య‌జ‌మాని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Exit mobile version