Hyderabad |
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చందానగర్ కషాడియా షాపింగ్ మాల్ ఐదో అంతస్తులోని జేపీ సినిమా మాల్‌లో మంటలు చెలరేగాయి. శనివారం తెత్లవారుజామున 4 గంటల సమయంలో షాట్‌సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి.
దీంతో అప్రమత్తమైన మాల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. స్క్రీన్ రెండులో అంటుకున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. అయితే 6, 7 అంతస్తులకు కూడా మంటలు వ్యాపించాయి.
దీంతో భారీ క్రేన్ సహాయంతో, 3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. జేపీ సినిమా మాల్‌లో ఉన్న మూడు స్క్రీన్లు దెబ్బతిన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జోనల్ కమిషనర్ పరిశీలించారు.