Site icon vidhaatha

జ‌న్ శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో స్వ‌ల్ప అగ్ని ప్ర‌మాదం


విధాత‌: భువ‌నేశ్వ‌ర్‌-హౌరా జ‌న్ శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఒడిశాలోని క‌ట‌క్ రైల్వేస్టేష‌న్‌లో ఈ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం తెల్ల‌వారుజామున స్వ‌ల్పంగా మంట‌లు చెల‌రేగాయి. రైలు బోగీలోని బ్రేక్ బాక్స్‌లో స్వ‌ల్పంగా పొగ వ్యాపించి మంట‌లు అంటుకున్నాయి.


స‌కాలంలో స‌మాచారం అందుకున్న రైల్వే అధికారులు మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. అయితే, మంట‌లు చెల‌రేగడానికి గల కార‌ణాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. మంట‌లు పూర్తిగా ఆరిపోయిన త‌ర్వాత రైలు కొంత స‌మ‌యం త‌ర్వాత తిరిగి బ‌య‌లు దేరింది. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉన్న‌ది.

Exit mobile version