- కసిరెడ్డి, ఠాకూర్ చేరికలను ఆహ్వానిస్తున్నాం
- మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి
విధాత, హైదరాబాద్: బీఆరెస్ వీడి కాంగ్రెస్ లో చేరే నేతలతో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి కల్వకుర్తి నియోజకవర్గంలో హస్తం జెండా ఎగురవేస్తామని కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి వెల్లడించారు.
మంగళవారం ఆయన నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆపార్టీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరనున్నారని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా నాయకులందరం చర్చలు జరిపి అనంతరం చేరికను ఆహ్వానిస్తూ, పార్టీ కోసం సమష్టిగా పని చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అధిష్టాన నిర్ణయం మేరకు ముందుకు సాగుతామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని తీర్మానించినట్లు స్పష్టం చేశారు.