Gayatri Gupta |
గాయత్రి గుప్తా.. అంటే ఠక్కున గుర్తుకు రాకపోవచ్చు. కాని ఫిదా బ్యూటీ అంటే మాత్రం కొంత క్లారిటీ వస్తుంది. ఫిదా చిత్రంలో సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించిన గాయత్రి గుప్తా అందరి దష్టిని ఆకర్షించింది. ఈ అమ్మడు డిఫరెంట్ క్యారెక్టర్లు.. చేస్తూ.. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది.
అప్పట్లో ఒక తెలుగు చిత్ర నిర్మాత తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, వారి సినిమాను అంగీకరించిన తర్వాత లైంగిక సహాయం కూడా కోరినట్లు ఆమె సంచలన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పిన ఈ భామ చాలా మంది హీరోయిన్లు ఇష్టంతోనే ఆ పని చేస్తున్నపుడు కాదనడానికి మనమెవరం అని పేర్కొంది.
గాయత్రి టాలీవుడ్ లో ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి సినిమాలతో పాటు అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాల్లో కనిపించి సందడి చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం తన ఆరోగ్యం బాగోలేదని చెప్పిన ఆమె ఇప్పుడు తన పరిస్థితి క్రిటికల్ గా తయారైందని కూడా పేర్కొంది.
తాను ఆటో ఇమ్యూనిటీ సమస్యతో బాధ పడుతున్నట్టు చెప్పుకొచ్చింది. గత ఏడాదిన్నర కాలంగా చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పిన భామ నెలకు ఒకటి రెండు ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్టు కూడా తెలిపింది. మెడికేషన్ డోస్ పెరుగుతూ పోవడం వలన ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్టు పేర్కొంది.ప్రస్తుతం తన దగ్గర చికిత్సకి డబ్బులు లేవని, విరాళాలు సేకరించాలని అనుకుంటున్నట్టు కూడా తెలియజేసింది.
అయితే ఎప్పటికప్పుడు వివాదాస్పద పనులతో హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉండే గాయత్రి వర్మ తాజాగా తన బర్త్ డే అని తెలియజేస్తూ వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంది. ఉదయాన్నే లేచి ఆ తర్వాత కేక్ పైన ఉన్న క్యాండిల్‌ని లైటర్‌తో వెలిగించి, ఆ నిప్పుతో నోట్లో ఉన్న సిగరెట్ వెలిగించింది. అనంతరం కేక్ పై ఉన్న క్యాండిల్ ఊది కేక్ తినేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుండగా, కొందరు ఆమెకి విషెస్ చెబుతుండగా, మరి కొందరు ఆమెని ఎప్పటిమాదిరిగానే ట్రోల్ చేస్తున్నారు.