GHMC | డల్లాస్ కాదు.. నగరాన్ని కేసీఆర్, కేటీఆర్ కల్లాస్ చేశారు: అంజన్ కుమార్

GHMC సమాధానం చెప్పకుండా కమిషనర్‌ వెళ్లిపోవడంపై ఫైర్‌ విధాత: హైద్రాబాద్ నగరాన్ని డల్లాస్ చేస్తామన్న సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు చివరకు కల్లాస్ చేశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ముట్టడి అనంతరం పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. వరద సమస్యలపై జీహెచ్‌ఎంసీ ముందు ధర్నా చేసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కు వినతి పత్రం ఇచ్చే క్రమంలో డల్లాస్ ఎక్కడ ఉందని అడిగితే ఆయన సీరియస్‌గా వెళ్లిపోయాడని […]

  • Publish Date - July 28, 2023 / 01:20 AM IST

GHMC

  • సమాధానం చెప్పకుండా కమిషనర్‌ వెళ్లిపోవడంపై ఫైర్‌

విధాత: హైద్రాబాద్ నగరాన్ని డల్లాస్ చేస్తామన్న సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు చివరకు కల్లాస్ చేశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ముట్టడి అనంతరం పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు.

వరద సమస్యలపై జీహెచ్‌ఎంసీ ముందు ధర్నా చేసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కు వినతి పత్రం ఇచ్చే క్రమంలో డల్లాస్ ఎక్కడ ఉందని అడిగితే ఆయన సీరియస్‌గా వెళ్లిపోయాడని అంజన్‌కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ముంపు కాలనీ వాసులకు నిత్యావసర వస్తువులను, ఫుడ్ పాకెట్స్ పంపలేదన్నారు. బాధితులకు 15వేల పరిహారం ఇవ్వాలని, రోజువారి కూలీలకు ఉపాధి కల్పించాలని కమిషనర్ ను కోరామన్నారు.

కేటీఆర్ ఏమి చెప్పకపోవడంతో కమిషనర్ ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు నగరం ఎందుకు మునగలేదో ఆలోచించాలన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు నాలాలు కబ్జా కాలేదని, అందుకే నగరం మునగలేదన్నారు. సముద్రాన్ని నగరానికి తీసుకువచ్చిన ఘనత బీఆర్ ఎస్‌ పార్టీకే దక్కిందన్నారు.

అభివృద్ధి చేసామని బీఆర్ ఎస్ చెబితే అండర్ పాస్ లలో నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయన్నారు. నగరం అభివృద్ధి చేశాం అని చెప్పిన మాటలు, ఉత్తివేనన్నారు. కేసీఆర్ పాలనలో హైద్రాబాద్ అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్‌లు విజయారెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు.

Latest News