Site icon vidhaatha

Nalgonda: తాటి చెట్టు పై పిడుగు.. జారీపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు…

విధాత: తాటి చెట్టు పై పిడుగు పడటంతో చెట్టు నుండి జారీ పడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో రేగట్ట గ్రామానికి చెందిన గుంటికాడి ఆంజనేయులు ప్రతినిత్యం మాదిరిగానే కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. అదే సమయంలో తాటి చెట్టు పై పిడుగు పడటం.. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన రావడంతో చెట్టు పైనుంచి గీత కార్మికుడు ఆంజనేయులు జారిపడ్డాడు.

ప్రమాదంలో గీత కార్మికుని తలకు తీవ్ర‌ గాయాలు కావడంతో చికిత్స కోసం నల్లగొండ సాయి రక్ష ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు.

Exit mobile version