Kajol | చేతిక‌ర్ర సాయంతో న‌డుస్తున్న స్టార్ హీరోయిన్.. ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళ‌న

Kajol | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌ తనూజ సమర్థ్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి త‌న స‌త్తా చూపింది. కేవ‌లం 16 ఏళ్ల వ‌య‌స్సులోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కాజోల్ రాహుల్ రవైల్ దర్శకత్వంలో ‘బెఖుడి’లో నటించి మెప్పించింది. ఇక 1993లో ‘బాజీగర్’  చిత్రంతో కాజోల్ పేరు మోరు మ్రోగింది. షారూఖ్ - కాజోల్ కాంబినేష‌న్ అంటే ఇప్ప‌టికీ మంచి క్రేజ్ ఉంది. త‌న అందంతో పాటు […]

  • Publish Date - August 17, 2023 / 03:46 AM IST

Kajol |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌ తనూజ సమర్థ్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి త‌న స‌త్తా చూపింది. కేవ‌లం 16 ఏళ్ల వ‌య‌స్సులోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కాజోల్ రాహుల్ రవైల్ దర్శకత్వంలో ‘బెఖుడి’లో నటించి మెప్పించింది. ఇక 1993లో ‘బాజీగర్’ చిత్రంతో కాజోల్ పేరు మోరు మ్రోగింది.

షారూఖ్ – కాజోల్ కాంబినేష‌న్ అంటే ఇప్ప‌టికీ మంచి క్రేజ్ ఉంది. త‌న అందంతో పాటు ప‌ర్‌ఫార్మెన్స్ తో బాలీవుడ్ లోనే కాదు.. ఇటు సౌత్ లో కూడా కాజోల్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమెకి డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు కాజోల్ లీడ్ రోల్స్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లోను దూసుకుపోతున్న కాజ‌ల్ ఇటు వెండితెరపైనే కాదు వెబ్ సీరీస్ లో కూడా న‌టిస్తూ సంద‌డి చేస్తుంది. తాజాగా కాజోల్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇందులో కాజోల్ చేతి క‌ర్ర సాయంతో నడుస్తుంది. ఇది చూసిన వారు కాజోల్‌కి ఏమైంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం కాజోల్‌కి చిన్న‌పాటి గాయ‌మైందే త‌ప్ప ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని తెలుస్తుంది. అయితే కాజోల్‌ని ఇలా చూసిన నెటిజన్స్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం కాజోల్ వీడియో నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది.

కాజోల్ ‘ది ట్రయల్’ అనే వెబ్ సీరీస్ లో నటించ‌గా, ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో లాయర్ నోయోనికాసేన్ గుప్తా అనే పాత్రలో నటించి మెప్పించింది. అమెరికన్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’ కు ‘ది ట్రయల్’ఇండియన్ వెర్షన్ గా ఇది తెర‌కెక్క‌గా, ఇది భర్త చేతిలో మోసపోయిన ఓ లాయర్ తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొంది అనే కథతో రూపొందింది.

ఇందులో కాజోల్ ప‌ర్‌ఫార్మెన్స్ ప‌ట్ల విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇక ప్ర‌స్తుతం మిస్టిరీ థ్రిల్లర్ మూవీ దో పట్టీ లో నటిస్తుంది. ఇది కూడా ఓటీటీ రిలీజ్ కు వెళ్తుండగా.. ఈ మూవీలో కాజోల్ తో పాటు కృతి సనన్ కూడా క‌నిపించ‌నుంది. ఇక కాజోల్ సోష‌ల్ మీడియాలో కూడా తెగ సంద‌డి చేస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ నెస్‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

Latest News