TSRTC Bus Pass | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. హైదరాబాద్ సిటీ నుంచి సబర్బన్ ఏరియాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లోనూ గ్రేటర్ స్టూడెంట్ బస్‌పాస్‌లు చెల్లుబాటు కానున్నాయి.
పల్లెవెలుగుతో పాటు ఎక్స్‌ప్రెస్‌గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లోనూ విద్యార్థులకు ప్రయాణించడానికి అనుమతించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని సూచించారు.