నైజీరియా మసీదులో కాల్పులు.. ఇమామ్ సహా 12 మంది మృత్యువాత
నైజీరియాలోని ఓ మసీదులో శనివారం రాత్రి ముష్కరులు ఇమామ్‌తో సహా 12 మందిని హతమార్చారు. మరికొంత మందిని కిడ్నాప్ స్థానికులు ఆదివారం తెలిపారు. అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ సొంత రాష్ట్రమైన కట్సినాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముష్కరులు మోటర్‌బైక్‌పై మగామ్‌జీ మసీదు వద్దకు వచ్చి కాల్పులు ప్రారంభించారు. కాల్పుల శబ్దాలు విన్న చాలా మంది అక్కడి నుంచి తప్పించుకున్నారు.

అబుజా : నైజీరియాలోని ఓ మసీదులో శనివారం రాత్రి ముష్కరులు ఇమామ్‌తో సహా 12 మందిని హతమార్చారు. మరికొంత మందిని కిడ్నాప్ స్థానికులు ఆదివారం తెలిపారు. అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ సొంత రాష్ట్రమైన కట్సినాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముష్కరులు మోటర్‌బైక్‌పై మగామ్‌జీ మసీదు వద్దకు వచ్చి కాల్పులు ప్రారంభించారు. కాల్పుల శబ్దాలు విన్న చాలా మంది అక్కడి నుంచి తప్పించుకున్నారు.
బందిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు జనాన్ని చంపడంతో పాటు కిడ్నాప్‌కు పాల్పడుతుంటాయి. కిడ్నాప్‌కు గురైన వారిని విడుదల చేసేందుకు డబ్బులు డిమాండ్ చేస్తుంటాయని పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే బందిపోట్లను ఉగ్రవాదులుగా నైజీరియా ప్రభుత్వం ఇటీవల ముద్ర వేసింది. బందిపోట్ల ముఠా రాత్రి ప్రార్థనలకు హాజరైన వారిపై కాల్పులు జరుపగా.. ఇమామ్ సహా 12 మంది మరణించారని స్థానికులు తెలిపారు. చాలామందిని బందిపోట్లు అపహరించుకుపోయారని, వారిని విడుదల చేయాలని స్థానికుడు అబ్దుల్లాహి మహహ్మద్ కోరారు.