Harihara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పిరియాడికల్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్..ప్లేస్ ఖరారైంది. ఈ నెల ఈ నెల 8న తిరుపతి తారకరామా స్టేడియంలో హరిహర వీరమల్లు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ అనుమతులు కోసం ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టార్ కు దరఖాస్తు చేసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ సినిమా విడుదల కావడం తొలిసారి కావడంతో సహజంగానే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు భారీగా అభిమానులతో పాటు జనసేన శ్రేణులు హాజరయ్యే అవకాశముండటంతో మూవీ టీమ్ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయనుంది.
పవన్ కల్యాణ్ ఒక రోజు ముందుగానే తిరుమల తిరుపతికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుని..తదుపరి రోజు 8వ తేదీన జరిగే హరిహర వీరమల్లు సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరవుతారని సమాచారం. ఫ్రీరిలీజ్ ఈవెంట్ లోనే సినిమా కొత్త ట్రైలర్, ప్రోమో విడుదల చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. జూన్ 12న దేశ వ్యాప్తంగా విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాను ఏ.ఎం.రత్నం సమర్పణలో దివాకర్ రావు నిర్మించారు. క్రిష్-జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ అభిమానులు చాల నెలలుగా ఎదురుచూస్తున్నారు.