Site icon vidhaatha

అస్సాంలో దారుణం.. బాలిక‌పై యాసిడ్ దాడి


విధాత‌: ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువ‌కుడు 17 ఏండ్ల‌ బాలిక‌పై యాసిడ్ దాడి చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న అస్సాంలోని బార్‌పేట జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న‌ది. బాలిక ప్రస్తుతం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు బుధ‌వారం మీడియాకు వెల్ల‌డించారు.


పోలీసుల వివరాల ప్ర‌కారం.. బాలిక, ఆమె సోదరి స్థానిక బుక్ ఫెయిర్ నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరి వద్దకు వచ్చిన యువ‌కుడు బాలికపై యాసిడ్ పోసి పారిపోయాడు. యాసిడ్ మంట‌తో బాలిక అరుపులు విన్న స్థానికులు ఆమెను సమీపంలోని ద‌వాఖాన‌కు తరలించారు.


తర్వాత ఆమెను గౌహతి మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని అతని ఇంట్లోనే పోలీసులు అరెస్టు చేశారు. అత‌డిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని విచారించ‌గా, నేరాన్ని అంగీకరించాడని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.

Exit mobile version