Site icon vidhaatha

High Court | గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌..పేపర్‌ లీకేజీ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి: హైకోర్టులో పిల్

High Court |

హైద‌రాబాద్‌, విధాత: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ లీకేజీ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది.

అభ్యంతరాలను పక్కన‌ పెట్టి పిటిషన్‌ నంబర్‌ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం రిజిస్ట్రీని గురువారం ఆదేశించింది.

ఫైలింగ్‌ నంబర్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, హైదరాబాద్‌ సీపీ, సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది.

అలాగే పేపర్‌ లీకేజీ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను చెప్పింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Exit mobile version