Site icon vidhaatha

Indian Coast Guard | అర్ధ‌రాత్రి.. న‌డిసంద్రంలో రెస్క్యూ ఆప‌రేష‌న్‌.. చైనా జాతీయుడిని ర‌క్షించిన కోస్ట్‌గార్డ్‌

Indian Coast Guard |

విధాత‌: అర్ధ‌రాత్రి న‌డి స‌ముద్రంలో ప్ర‌యాణిస్తున్న ఓ చైనా జాతీయుడి (China man) కి గుండెపోటు రావ‌డంతో.. ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్ ర‌క్షించిన ఘ‌టన తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. చైనా నుంచి యూఏఈ వెళుతున్న ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ -2 అనే నౌక ముంబ‌యికి 200 కి.మీ. ప్ర‌యాణిస్తుండ‌గా భార‌త మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేష‌న్ సెంట‌ర్‌కు ఒక మెసేజ్ వ‌చ్చింది.

త‌మ స‌భ్యుల్లో ఒక‌రికి తీవ్ర గుండెపోటు వ‌చ్చిందని.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నందున సాయం చేయాల‌ని వారు అందులో అభ్య‌ర్థించారు. కోస్ట్‌గార్డ్ (Indian Coast Guard) వైద్యులు ఫోన్‌లోనే ప్ర‌థ‌మ చికిత్స ఎలా చేయాలో చెప్పి అత‌డిని అక్క‌డి నుంచి తీసుకురావ‌డానికి రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే వాతావ‌ర‌ణం బాగాలేక‌పోవ‌డం, చిమ్మ చీక‌టి కావ‌డంతో ప‌రిస్థితి సంక్లిష్టంగా మారింది.

అయినా అత్యాధునిక‌మైన అడ్వాన్స్ లైట్ హెలికాప్ట‌ర్ ఎంకె 3 సాయంతో వారు ఎంవీ డాంగ్ నౌక‌ను చేరుకున్నారు. అక్క‌డ‌కి చేరుకున్న వెంట‌నే అత‌డికి ప్ర‌థ‌మ చికిత్స చేసి ఇక మీరు క్షేమ‌మేన‌ని అత‌డికి ధైర్యం చెప్పారు. వెంట‌నే అత‌డికి హెలికాప్ట‌ర్‌లోనే డామ‌న్‌లోని ఒక ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు వీడియోలో క‌న‌ప‌డింది. బాధిత చైనా జాతీయుడిని యిన్ వీజ‌యంగ్ గా గుర్తించారు.

మ‌రో ఘ‌ట‌న‌లో ఫిలిప్పీన్స్ పౌరుడినీ..

సోమ‌వారం జ‌రిగిన మ‌రో ఘ‌ట‌న‌లో అనారోగ్యానికి గురై బాధ‌ప‌డుతున్న ఫిలిప్పీన్స్ పౌరుణ్ని కోస్ట్‌గార్డ్ ర‌క్షించింది. కొలంబో నుంచి సూయ‌జ్ కెనాల్‌కు వెళుతున్న వెసెల్‌లో ఫిలిప్పీన్స్‌కు చెందిన వాలిడ్ ఓలా ప్ర‌యాణిస్తున్నారు. కొచ్చి నుంచి 100 నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఉండ‌గా అత‌డికి అనారోగ్యం క‌లిగి ఆక్సిజ‌న్ పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. స‌మాచారం అందుకున్న సిబ్బంది ఐసీజీఎస్ సీ 427 నౌక‌లో అక్క‌డ‌కి చేరుకుని అత‌డిని తీసుకొచ్చారు. అనంత‌రం బాధితుణ్ని కేర‌ళ తీరంలోని ఒక ఆసుప‌త్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు.

Exit mobile version