లైంగిక వేధింపుల కేసు.. రచయితకు 8,658 ఏండ్ల జైలు శిక్ష
Adnan Oktar | లైంగిక వేధింపుల కేసులో తుర్కియేలోని ఇస్తాంబుల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 8,658 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. ఇస్లామిక్ టీవీ మత బోధకుడు, రచయిత అద్నన్ ఒక్తర్.. పలు టీవీ కార్యక్రమాల్లో మహిళల అలంకరణ, వేషధారణపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళలను పిల్లి కూనలు అని సంబోధించారు. దీంతో అతనిపై కేసు నమోదైంది. 2018లో అదుపులోకి తీసుకున్నారు. ఒక్తర్‌తో పాటు 77 మందిని అరెస్టు […]

Adnan Oktar | లైంగిక వేధింపుల కేసులో తుర్కియేలోని ఇస్తాంబుల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 8,658 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇస్లామిక్ టీవీ మత బోధకుడు, రచయిత అద్నన్ ఒక్తర్.. పలు టీవీ కార్యక్రమాల్లో మహిళల అలంకరణ, వేషధారణపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళలను పిల్లి కూనలు అని సంబోధించారు. దీంతో అతనిపై కేసు నమోదైంది. 2018లో అదుపులోకి తీసుకున్నారు. ఒక్తర్‌తో పాటు 77 మందిని అరెస్టు చేశారు. లైంగిక వేధింపులు, మోసం, సైనిక గూఢచర్యానికి ప్రయత్నించడం లాంటి నేరాలకు సంబంధించి గతేడాది ఒక్తర్‌కు 1,075 ఏండ్ల జైలు శిక్ష విధించింది. కానీ ఈ తీర్పును పైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు పునర్విచారణలో భాగంగా ఒక్తర్‌కు తాజాగా ఇస్తాంబుల్ కోర్టు 8,658 ఏండ్ల జైలు శిక్ష విధించింది.