Jagityala | దీప్తి కేసులో చెల్లెలే హంతకురాలు.. వోడ్కా తాగించి, చేతులు కట్టేసి! వీడిన మిస్టరీ

Jagityala | బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఘాతకం. విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి అనుమానా స్పద మృతి మిస్టరీ వీడింది. చెల్లెలే హంతకురాలని పోలీస్ విచారణలో తేలింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ హత్య కావాలని చేసింది కాదన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ వివరాలు వెల్లడించారు. బీటెక్ నాలుగు సంవత్సరాలు పూర్తయి చందన గత కొద్ది […]

  • Publish Date - September 2, 2023 / 02:45 PM IST

Jagityala |

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఘాతకం.

విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి అనుమానా స్పద మృతి మిస్టరీ వీడింది. చెల్లెలే హంతకురాలని పోలీస్ విచారణలో తేలింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ హత్య కావాలని చేసింది కాదన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ వివరాలు వెల్లడించారు.

బీటెక్ నాలుగు సంవత్సరాలు పూర్తయి చందన గత కొద్ది రోజుల నుంచి కోరుట్లలోని తన ఇంటి వద్దనే ఉంటుందన్నారు. తన బాయ్ ఫ్రెండ్ ఉమర్ కు చందన ఫోన్ చేయగా అప్పుడప్పుడు కోరుట్లకు వచ్చి ఆమెను కలుస్తుండేవాడన్నారు.

ఈక్రమంలో 19 న కోరుట్లకు ఉమర్ వచ్చినప్పుడు చందన తన పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని, బయటికి పోయి పెళ్లి చేసుకుందామని చెప్పగా అందుకు ఉమర్ ఉద్యోగం, డబ్బులు లేకుండా బయటకు వెళ్లి ఎలా జీవిస్తామని ప్రశ్నించారు.

ఏది ఏమైనా సరే పెళ్లి చేసుకోవాలని చందన ఉమర్ కు చెప్పగా ఉమర్ వాట్సాప్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులైన తల్లి సయ్యద్ ఆలియా మహబూబ్, చెల్లె ఫాతిమా, తన ఫ్రెండ్ అయిన హఫీజ్తో కలిసి చందనతో మాట్లాడినట్లు తెలిపారు.

తర్వాత రెండు రోజులకు చందన ఉమర్ కు ఫోన్ చేసి తమ ఇంట్లో బంగారం, డబ్బులు ఉన్నాయని వాటిని తీసుకెళ్లి పెళ్లి చేసుకొని బతుకుదామని చెప్పిందన్నారు. అప్పుడు ఉమర్ కూడా తన కుటుంబ సభ్యులకు చందన వద్ద పెద్ద మొత్తంలో బంగారం, డబ్బులు ఉన్నాయని చెప్పారని ఎస్పీ వెల్లడించారు.

పథకంలో భాగంగా చందన ఉమర్ కు 28 న తన తల్లిదండ్రులు హైదరాబాదులోని ఒక ఫంక్షన్ కి వెళ్తున్నట్లు, అక్క దీప్తి తో ఇద్దరమే ఉంటామని ఉమర్ కు చెప్పి రమ్మని చెప్పింది. 28న ఉదయం 7 గంటల సమయంలో ఉమర్ తన కారులో హైదరాబాదు నుంచి బయలుదేరి 11:00 గంటలకు కోరుట్లకు చేరుకున్నాడు.

పథకం ప్రకారం చందన అక్కకు వోడ్కా త్రాగించి తను పడుకున్న తర్వాత రాత్రి 02:00 సమయంలో ఉమర్ కు తన ఇంటికి రమ్మని మెసేజ్ చేయగా ఉమర్ చందన ఇంటి వెనకాల కారును పార్కు చేసి ఇంటి వెనకాల గేటు నుంచి ఇంటిలోకి ప్రవేశించారు.

పథకం ప్రకారం

తన ఇంటి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు సర్దుతుండగా అలికిడికి అక్క దీప్తి లేచి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావే అని అరుపులు అరవగా, టేపులతో చందన, ఉమర్ లు ఇద్దరు కలిసి దీప్తి ముక్కు, మూతికి స్కార్పు చుట్టి, చున్నీతో చేతులు కట్టేసి, మూతి, ముక్కుపై టేపును అంటించి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కట్లన్నీ విప్పేసి మందు త్రాగి చనిపోయిందని నమ్మించే విధంగా సీన్ క్రియేట్ చేసి డబ్బు, నగలుతో ఇంటి నుండి పారిపోయినట్లు తెలిపారు.

సంచలనం సృష్టించిన ఈ కేసును త్వరగా చేదించేందుకు మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోరుట్ల సిఐ ప్రవీణ్ కుమార్, ఐదు బృందాలుగ్ కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ సిబ్బందితో ఏర్పాటు ఏర్పాటు చేసి గాలించడం జరిగిందన్నారు.

ఆర్మూర్ – బాల్కొండ రహదారిపై అరెస్ట్..

ఐదుగురు నిందితులంత కలిసి మహారాష్ట్ర వైపు పారిపోతున్నారని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాచారం అందుకున్న కోరుట్ల పోలీసులు ఆర్మూర్ – బాల్కొండ రూట్లోని జై వీర్ తేజ దాబా వద్ద వీరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పి భాస్కర్ వెల్లడించారు.

దీప్తి కేసులో మొదటి ముద్దాయిగా బంక చందన తో పాటు ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్, ప్రియుని తల్లి సయ్యద్ అలియా మహబూబ్, షేక్ అసియా ఫాతిమా, ప్రియుని సోదరి, స్నేహితుదు హఫీజ్ లను నిందితులుగా కేసు నమోదు చేసినట్లు ఎస్పి తెలిపారు.

ఖరీదైన బంగారం నగలు, నగదు స్వాధీనం.

బంగారు వడ్డానంలు – 2,పెద్ద బంగారు హారం – 1, పెద్ద బంగారు గాజుల జత –3, ఒక బంగారు కంకణం,చిన్న హారాలు-1, ఒక లక్ష రూపాయల నగదు, వారి సెల్ ఫోన్లు, ఒక కారును నిందితుల నుండి స్వాధీనపరచుకున్నట్లు ఎస్పి పేర్కొన్నారు.

కాగా ఒక యువతి,ఒక యువకుడు కోరుట్ల బస్టాండ్ వద్ద నిలబడి నిజామాబాద్ వైపు బస్సు ఎక్కినట్లు వచ్చిన కథనాలు, చందన వారి ప్రియుడివి కావా అని, నిందితులు కారులో వెళితే బస్ స్టేషన్ సిసి ఫుటేజ్ లు వైరల్ అయిన విషయాన్ని కొందరు పాత్రికేయులు ప్రశ్నించగా, అది తాము విడుదల చేసింది కాదని, వాటిని వెంటనే తొలగించడంతోపాటు వైరల్ చేయవద్దని, సంబంధం లేని వారి ఇరువురి ప్రైవసీ భంగం కలిగించకూడదని జిల్లా ఎస్పీ మీడియాకు సూచించారు.

పోలీస్ ఆఫీసర్, సిబ్బందిని ను అభినందించిన SP

ఈ రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన మెటుపల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి, కోరుట్ల సిఐ ప్రవీణ్ కుమార్, కోరుట్ల ఎస్ ఐ కిరణ్, మేడిపల్లి ఎస్ ఐ చిరంజీవి, కథలపూర్ ఎస్ ఐ కిరణ్ కుమార్ పోలిస్ కానిస్టేబుళ్లు విజయ్, పురుషోత్తమ్, శ్రీను నాయక్ లను ఎస్పి భాస్కర్ అభినందించారు.

Latest News