విధాత: జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ లోహియా దారుణ హత్యకు గురయ్యాడు. జమ్మూ శివార్లలోని ఉదయ్‌వాలాలోని నివాసంలో హేమంత్‌ను గొంతుకోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే హేమంత్ లోహియా ఇంట్లో పని చేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హేమంత్‌ను హత్య చేసి ఇంట్లో నుంచి పారిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హేమంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హేమంత్ లోహియా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. 57 ఏండ్ల వయసున్న హేమంత్.. ఈ ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీగా నియమితులయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్ పర్యటనలో ఉన్న రోజే ఈ ఘటన జరిగింది.