Site icon vidhaatha

Errabelli Pradeep Rao| కొండా మురళిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో వేయాలి: ఎర్రబెల్లి ప్రదీప్ రావు

ఆయన బీసీ నినాదం రాజకీయ డ్రామా

విధాత, హైదరాబాద్ : ఎన్నికల్లో రూ.70కోట్లు ఖర్చు పెట్టినట్లుగా కొండా మురళి చేసిన మాటలు పిచ్చిమాటలైతే ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో వేయాలని..అప్పుడు మేం ఎన్నికల సంఘం వద్ద మా ఫిర్యాదు వెనక్కి తీసుకుంటామని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో రూ.70కోట్ల ఖర్చు పెట్టానని కొండా మురళి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో సురేఖ ఎన్నికను రద్దు చేయాలంటూ ప్రదీప్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రదీప్ రావు ఎర్రబెల్లి..బల్లి అని మాపైన..మహిళలను, ముస్లింలపైన కొండా దంపతులు అనుచితంగా విమర్శలు చేశారని తప్పుబట్టారు. కొండా సురేఖ, మురళిలను ఏదైనా అంటే బీసీ మాటలు మాట్లాడుతున్నారని..వారి బీసీ నినాదం ఓ రాజకీయ డ్రామా అన్నారు. బీసీల కోసం పనిచేస్తామంటు మంత్రి పదవి కోసం ఓసీ నేతలైన రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి సంకలో చేరారని విమర్శించారు. కొండా బీసీల కోసం పనిచేస్తే వరంగల్ లో బీసీ కార్పోరేటర్లపై ఎందుకు అక్రమ కేసులు పెట్టించి మళ్లీ వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. కొండా దంపతుల అవకాశవాద రాజకీయాలకు కాలం చెల్లిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలన్నారు.

Exit mobile version