విధాత: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ డీజీ నేతృత్వంలో ఐదుగురు పోలీస్ అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసింది. సిట్ బృందంలో సీనియర్ పోలీస్ అధికారి రమేష్‌రెడ్డి.. ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు.
సిట్‌కు బదిలీచేసిన బెట్టింగ్ యాప్స్ కేసులను సిట్ బృందం దర్యాప్తు చేయనుంది.బెట్టింగ్ నిరోధించేందుకు సిట్ సూచనలు చేయనుంది . సిట్ టీమ్ 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని డీజీపీ ఆదేశించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తెలంగాణ పోలీసులు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11 మంది పైన, మియాపూర్ పోలీసులు 25 మందిపైన కేసులు నమోదు చేశారు. కేసులు ఎదుర్కొంటున్న వారిలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ , టీవీ, సినిమా నటులు ఉన్నారు.