Congress | హైకమాండ్‌కు.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

Congress | రాష్ట్ర స్థాయిలో ముగిసిన స్క్రీనింగ్ కమిటీ కసరత్తు విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారుకు రాష్ట్ర స్థాయిలో జరుగాల్సిన ఆ పార్టీ కసరత్తు ముగిసిపోగా, అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా పార్టీ ఢిల్లీ హైకమాండ్‌కు చేరుకుంది. పార్టీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ముందుగా పీఈసీలో చర్చించాకా వాటిని పరిశీలించి, స్క్రీనింగ్ కమిటీకి 538 మంది ఆశావహుల పేర్లతో జాబితాను సమర్పించారు. ఈ జాబితాలోని పేర్లపై పీఈసీ […]

  • Publish Date - September 6, 2023 / 01:07 PM IST

Congress |

  • రాష్ట్ర స్థాయిలో ముగిసిన స్క్రీనింగ్ కమిటీ కసరత్తు

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారుకు రాష్ట్ర స్థాయిలో జరుగాల్సిన ఆ పార్టీ కసరత్తు ముగిసిపోగా, అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా పార్టీ ఢిల్లీ హైకమాండ్‌కు చేరుకుంది. పార్టీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ముందుగా పీఈసీలో చర్చించాకా వాటిని పరిశీలించి, స్క్రీనింగ్ కమిటీకి 538 మంది ఆశావహుల పేర్లతో జాబితాను సమర్పించారు. ఈ జాబితాలోని పేర్లపై పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ విడివిడిగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం పీఈసీ తమకు అందించిన జాబితాను, సభ్యుల అభిప్రాయాల మేరకు రూపొందించుకున్న షార్ట్ లిస్టుతో ఢిల్లీకి వెళ్లింది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులున్న నియోజకవర్గాలలో కొన్నింటిలో రెండు, మరికొన్నింటిలో మూడుపేర్లతో స్క్రీనింగ్ కమిటీ జాబితాను సిద్ధం చేసింది. ఆ జాబితాను సీల్డ్ కవర్ లో పార్టీ హైకమాండ్‌కు సమర్పించనుంది. పార్టీ హైకమాండ్ అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను అధికారికంగా ప్రకటించనుంది. అయితే అంతకుముందు స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశమవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించడం గమనార్హం.

30 నియోజవర్గాలలో ఒక్కటే పేరు

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చేతిలో ఉన్న జాబితాలో దాదాపుగా 30నియోజకవర్గాలలో ఒక అభ్యర్థి పేరు మాత్రమే పరిశీలనలో ఉందని, వారికి పక్కా టికెట్ ఖాయమని తెలుస్తుంది. ఇందులో పార్టీ సీనియర్లు, మాజీ ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారని సమాచారం. అభ్యర్థుల ఖరారులో పీఈసీ, స్క్రీనింగ్ కమిటీల కసరత్తుతో పాటు పార్టీ హైకమాండ్ సొంత సర్వేల నివేదికలను, సునీల్ కనుగోలు బృందం సర్వేను, సీట్ల కేటాయింపులలో సామాజిక సమీకరణలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఫైనల్ చేయనుంది.

ఈనెల 20వ తేదీలోపునే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించాలనుకుంది. అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటన్నది తేలక పోవడంతో ఈ సమావేశాలు ముగిశాకే అభ్యర్థులను ప్రకటించవచ్చని పార్టీ వర్గాల కథనం. ఇప్పటికే బీఆరెస్ పార్టీ 115మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం, బీజేపీ సైతం అభ్యర్థుల ఖరారు దిశగా ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటుండటంతో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను వీలైనంత త్వరతగతిన పూర్తి చేయాలని భావిస్తుంది.

Latest News