Viral Video | పైథాన్‌ను చూస్తేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. దానికి చిక్కకుండా పారిపోతాం. కానీ ఓ యువకుడు మాత్రం భారీ పైథాన్‌తో యుద్ధమే చేశాడు. దాడి చేసేందుకు యత్నించిన పైథాన్‌ను తన స్నేహితుల సాయంతో పట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా ఫ్లోరిడాలోని ఓహియో యూనివర్సిటీకి చెందిన ఓ యువకుడు(22) తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వారిని 19 అడుగుల పొడవున్న భారీ పైథాన్ […]
Viral Video | పైథాన్‌ను చూస్తేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. దానికి చిక్కకుండా పారిపోతాం. కానీ ఓ యువకుడు మాత్రం భారీ పైథాన్‌తో యుద్ధమే చేశాడు. దాడి చేసేందుకు యత్నించిన పైథాన్‌ను తన స్నేహితుల సాయంతో పట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికా ఫ్లోరిడాలోని ఓహియో యూనివర్సిటీకి చెందిన ఓ యువకుడు(22) తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వారిని 19 అడుగుల పొడవున్న భారీ పైథాన్ అడ్డగించింది.
దాన్ని నుంచి తప్పించుకునేందుకు యత్నించినప్పటికీ వారికి సాధ్యపడలేదు.దీంతో చివరకు ఓ యువకుడు సాహసం చేసి తన మిత్రుల సాయంతో 56.6 కిలోల బరువున్న పైథాన్‌ను ఎలాగొలా పట్టుకుని దాని తలను బిగి సడలకుండా అదిమి పట్టి అలాగే తీసుకెళ్లి అటవీశాఖ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ దక్షిణ ఫ్లోరిడాలో పైథాన్లు ఎక్కువగా ఉంటాయని, రాత్రి సమయాల్లో సాధారణంగా రోడ్లపైకి వస్తుంటాయని పేర్కొన్నారు. అయితే 2020 అక్టోబర్‌లో 18 అడుగుల పొడవున్న అత్యంత పెద్దదైనా బర్మీస్ పైథాన్‌ను పట్టుకున్నామని, ఆ తర్వాత ఇదే అత్యంత పెద్ద పైథాన్ అని అటవీశాఖ అధికారులు తెలిపారు.