Maoists: ఐఈడీ పేల్చిన మావోయిస్టులు..ఏఎస్పీ మృతి!

Maoists:  ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్ కౌంటర్లతో అగ్రనేతలు సహా వందలమంది పార్టీ సాయుధ సభ్యులను కోల్పోతున్న మావోయిస్టులు ప్రతికార దాడులకు దిగారు. సుక్మా జిల్లాలో పోలీసు వాహనం లక్ష్యంగా ఐఈడీ పేల్చారు. ఐఈడీతో పోలీస్ వాహనాన్ని పేల్చేసిన ఘటనలో అడిషనల్ ఎస్పీ ఆకాశ్ రావు  సహా మరో పోలీస్ అధికారి మృతి చెందారు. డీఎస్పీ, సీఐ సహా పలువురు పోలీసు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని భద్రతాబలగాలు సమీప ఆసుపత్రులకు తరలించాయి. అదనపు బలగాలు ఘటన […]

Maoists:  ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్ కౌంటర్లతో అగ్రనేతలు సహా వందలమంది పార్టీ సాయుధ సభ్యులను కోల్పోతున్న మావోయిస్టులు ప్రతికార దాడులకు దిగారు. సుక్మా జిల్లాలో పోలీసు వాహనం లక్ష్యంగా ఐఈడీ పేల్చారు. ఐఈడీతో పోలీస్ వాహనాన్ని పేల్చేసిన ఘటనలో అడిషనల్ ఎస్పీ ఆకాశ్ రావు  సహా మరో పోలీస్ అధికారి మృతి చెందారు. డీఎస్పీ, సీఐ సహా పలువురు పోలీసు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని భద్రతాబలగాలు సమీప ఆసుపత్రులకు తరలించాయి. అదనపు బలగాలు ఘటన స్థలికి చేరుకుని..మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.