Site icon vidhaatha

Medak | దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల వృధా: మందకృష్ణ మాదిగ

Medak

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాల పేరిట కోట్ల రూపాయల ధనాన్ని వృధా ఖర్చు చేస్తుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వికలాంగులకు దళిత బంధు వెంటనే ఇవ్వాలని అనాథ పిల్లల ఆశ్రమ పాఠశాలలను నిర్మించాలని గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.

అనాధ పిల్లలకు తిండి పెట్టలేని ప్రభుత్వం దశాబ్ది వేడుకల పేరుతో జల్సాలకు పాటుపడుతూ ఓట్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేసుతుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు.

గురువారం మెదక్ కలెక్టరేట్ ముందు వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఏర్పాటు చేసిన జీవో 34 తక్షణమే అమలు చేసి 33 జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, దళిత బంధు పథకం ద్వారా దివ్యాంగులకు 10 లక్షలు ఆర్థిక సాయం అందజేయాలని, అన్ని రకాల దివ్యాంగులకు రోస్టర్ పాయింట్ ను 10 లోపు మార్చాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ముందు దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. దీనికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్లు పెంచడానికి సిద్ధంగా లేని ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో చెరువుగట్లపై చికెన్ మటన్ల బిర్యానీతో ఈరోజు జల్సాలు చేస్తుంద‌ని ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తూ జల్సాలు చేస్తున్నారు ఇది చాలా అన్యాయం అని అన్నారు.

ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేసుతుంది అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2015లో తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం తల్లిదండ్రుల పాత్ర పోషిస్తుందని చెప్పి 8 సంవత్సరాలు అవుతుందని ఇప్పటివరకు హామీ నెరవేర్చలేదు అన్నారు..

అనాధలకు యాదగిరిగుట్టలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని, దానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానిస్తామని.. ప్రతి జిల్లాకు ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని
వాళ్లకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు.. అలాగే కుల ధృవీకరణ, ఆదాయం సర్టిఫికెట్ మినహాయింపులతో స్మార్ట్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమ‌ర్శించారు.

అనాధ పిల్లలను ఆదుకోవాలని ఈనెల 23న అన్ని జిల్లా కలెక్టరేట్ లముందు అనాధలకు ఇచ్చిన హామీ అమలు చేయలని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 2018 నుండి దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్ 3016 నుంచి 6000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు.

వికలాంగుల రిజర్వేషన్ శాతాన్ని నాలుగు నుంచి ఏడు శాతానికి పెంచాలని వికలాంగుల రోస్టర్ పాయింట్ ని 56 నుంచి పది లోపు తీసుకురావాలని సంక్షేమ పథకాల్లోనూ డబల్ బెడ్ రూమ్ అమల్లోనూ వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ విషయంలో ప్రభుత్వం మీనావేశాలు లెక్కపెట్టకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్న వికలాంగులకు 35 కిలోల బియ్యం ఇస్తూ అంత్యోదయ కార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ వికలాంగుల గొంతెమ్మ కోరికలు కావని న్యాయమైన డిమాండ్లు అన్నారు.. 2018లో ఉన్న బడ్జెట్ తో పోల్చుకుంటే రెట్టింపు స్థాయిలో బడ్జెట్ పెరిగిందని నిత్యవసర సరుకుల ధరలు పెరిగినయని పెరిగిన బడ్జెట్ కు అనుగుణంగా పెన్షన్ పెంచడం అనేది మానవత్వం ఉన్న ప్రతి ప్రభుత్వం చేయాల్సిన పని అన్నారు.

సంక్షేమ పథకాల విషయంలో, రిజర్వేషన్ విషయంలో, అంత్యోదయ కార్డు విషయంలో, వికలాంగులకు ప్రత్యేక గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు.. కలెక్టరేట్ ల ముందు వికలాంగులు చేస్తున్న ధర్నాకు ప్రభుత్వం స్పందించక పోతే జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలలో mro కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే ఆగస్టు మొదటి వారం చలో వికలాంగుల గర్జన హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ నేతలు బాలరాజు, యాదగిరి, సిద్దిరాములు, వికలాంగుల సంగం నాయకులు, లక్ష్మి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version