Jagadish Reddy | సూర్యాపేట‌కు కాళేశ్వ‌రం నీళ్లు.. ఇది కేసీఆర్ ఇంజినీరింగ్‌కు నిద‌ర్శ‌నం : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

Jagadish Reddy | సూర్యాపేట‌కు కాళేశ్వ‌రం జ‌లాలు తీసుకురావడం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంజినీరింగ్‌కు నిద‌ర్శ‌నం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ప్ర‌శంసించారు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. సీఎం కేసీఆర్ ప‌ది సంవ‌త్స‌రాల కాలంలోనే 60 ఏండ్ల అభివృద్ధిని చేసి చూపించారు.. ఇవాళ సూర్యాపేట ప్ర‌జ‌ల‌కు బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి ప‌నుల‌ను అంకిత‌మిచ్చారు అని మంత్రి పేర్కొన్నారు. ఇవాళ కేసీఆర్ చేతుల మీదుగా […]

  • Publish Date - August 20, 2023 / 01:27 PM IST

Jagadish Reddy | సూర్యాపేట‌కు కాళేశ్వ‌రం జ‌లాలు తీసుకురావడం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంజినీరింగ్‌కు నిద‌ర్శ‌నం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ప్ర‌శంసించారు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

సీఎం కేసీఆర్ ప‌ది సంవ‌త్స‌రాల కాలంలోనే 60 ఏండ్ల అభివృద్ధిని చేసి చూపించారు.. ఇవాళ సూర్యాపేట ప్ర‌జ‌ల‌కు బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి ప‌నుల‌ను అంకిత‌మిచ్చారు అని మంత్రి పేర్కొన్నారు. ఇవాళ కేసీఆర్ చేతుల మీదుగా నాలుగు ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను ప్రారంభించుకున్నాం. ప‌రిపాల‌న‌కు కేంద్ర‌మైన క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం, జిల్లా పోలీసు కార్యాల‌యం, ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ భ‌వ‌నాల‌ను, మోడ‌ల్ మార్కెట్‌ను ప్రారంభించారు కేసీఆర్. ఇదే సంద‌ర్భంలో జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని కూడా ప్రారంభించుకున్నాం అని మంత్రి తెలిపారు.

సూర్యాపేట ఎక్క‌డుండే.. ఎట్లుండే. చుట్టుముట్టు సూర్యాపేట‌ న‌ట్ట‌న‌డుమ న‌ల్ల‌గొండ అని నిన‌దించిన ప్రాంతం.. కాక‌తీయుల కాలం నుంచి నిజాం చివ‌రి రోజుల వ‌ర‌కు వ్య‌వ‌సాయ రంగంలో అద్భుతంగా వెల్లివెరిసింది. నాగ‌రిక‌త‌కు నెలువైన ఈ ప్రాంతం.. కాంగ్రెస్ పాపం వ‌ల్ల మ‌ళ్లీ 600 ఏండ్ల వెన‌క్కి పోయింది. ఒక‌ప్పుడు అంద‌రికి అన్నం పెట్టిన జిల్లా.. త‌నే అన్నం లేక ఆక‌లితో చ‌నిపోయింది. రైతులే ఆక‌లిచావులుకు గుర‌య్యే పిర‌స్థితి వ‌చ్చింది.

నాటి పాల‌కుల పాపం వ‌ల్ల భూగ‌ర్భ‌జ‌లాలు లోప‌లికి పోయాయి. ఫ్లోరిన్ భూతాన్ని, ఆక‌లిని పార‌దోలుదాం అని న‌ల్ల‌గొండ జిల్లా నాతో క‌లిసి రండి అని కేసీఆర్ ఊరురా తిరిగి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఊపిరి బిగ‌ప‌ట్టుకుని ఉండాల‌ని.. తెలంగాణ తెస్తాన‌ని చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని తీసుకచ్చారు కేసీఆర్. ఇవాళ దేశానికే అన్నం పెట్టే అన్న‌పూర్ణ జిల్లాగా మార్చారు. తెలంగాణ ఏర్ప‌డే నాడు 4 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ఇచ్చిన జిల్లా.. ఇప్పుడు 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు పైగా వ‌రి ధాన్యాన్ని అందించిందని మంత్రి గుర్తు చేశారు.

అంతేకాదు.. ఇవాళ అద్భుతంగా కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌తో పంట‌లు పండించుకుంటున్నాం. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చాం. ఆ ఫ‌లితం సూర్యాపేట‌కు అందింది. తుంగ‌తుర్తి, సూర్యాపేట‌, కోదాడ తాలుకాలు స‌స్య‌శ్యామ‌లం అయ్యాయి. ఇది కేసీఆర్ ఇంజినీరింగ్‌కు నిద‌ర్శ‌నం. 2014లో సూర్యాపేట ప‌ట్ట‌ణం ఎలా ఉండిందో గుర్తు చేసుకోవాలి. ఒక ప‌ట్ట‌ణం యొక్క డ్రైనేజీ నీళ్ల‌ను తీసుకొచ్చి.. మ‌రో ప‌ట్ట‌ణానికి మంచినీళ్ల‌ని చెప్పి తాగించారు.

అలాంటి దుస్థితి నాడు ఉండే. కానీ ఇప్పుడు మంచినీళ్ల స‌మ‌స్య తీర్చారు. సూర్యాపేట జిల్లా అయింది. మూసీ మురికి నీళ్ల పీడ వ‌దిలింది. గోదావ‌రి జ‌లాలు తీసుకొచ్చి ప్ర‌తి హామీ నెర‌వేర్చారు. వంద‌ల కోట్లు వెచ్చించి సూర్యాపేట‌ను సుంద‌రంగా తీర్చిదిద్దారు. రెండు మినీ ట్యాంక్‌బండ్‌లు ఇచ్చారు. 14 పార్కుల‌ను అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. వైకుంఠ‌ధామాల‌ను నిర్మించుకున్నాం. ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేలా ప‌ట్ట‌ణాన్ని తీర్చిదిద్దుకున్నాం అని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు.

Latest News