Site icon vidhaatha

Minister KTR | ఇది అమృత్‌ కాల్‌ కాదు.. ఏ మిత్ర్‌ కాల్‌: KTR

కేంద్రంపై ట్విటర్‌లో KTR సెటైర్‌

విధాత‌: కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ (Minister KTR) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలు పాలు, పెరుగు పైనా జీఎస్టీ కట్టాలి. అదానీ లాంటి ప్రత్యేక వ్యక్తులు ఎయిర్‌పోర్టులు పొందినప్పటికీ జీఎస్టీ వర్తించబోదని కేటీఆర్‌ ఆక్షేపించారు. జైపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అదానీ గ్రూపునకు బదిలీ.. జీఎస్టీ వర్తించదన్న వార్తకథనాలపై మంత్రి ట్విటర్‌ ద్వారా స్పందించారు.

సరిపడా విధానాలతో విమానశ్రయాలను పల్లెంలో వడ్డిస్తున్నారన్న కేటీఆర్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఇలా చేయడం ఉచితాలు కావన్న ఆయన ‘ఏ మిత్ర్‌ కాల్‌’ అని ఎద్దేవా చేశారు. ఇది కేవలం ‘ ఇది అమృత్‌ కాల్‌ కాదు.. ఏ మిత్ర్‌ కాల్‌’ వ్యాఖ్యానించారు.

Exit mobile version