- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
విధాత : గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. సోమవారం రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్, పాల ఉత్పత్తిదారుల భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో మూసీ పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి కాల్వల పనుల పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ 2014 సంవత్సరంలో తాను ఎమ్మెల్యేగా ధర్మారెడ్డి పల్లి, పిల్లాయి పల్లి కాలువలకు నిధులు విడుదల చేయించానన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సంవత్సరంలోపు పనులు పూర్తి చేయాలన్నారు. నీటిపారుదల సమస్యలను మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.