Site icon vidhaatha

Monsoon | తొలకరి మనకెప్పుడు? ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు (Monsoon) ముందుకు సాగుతున్నాయని వాతావరణ విభాగం ప్రకటించింది. కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురంలో కుంభవృష్టి కురిసింది. ఏపీలో ప్రవేశించిన నైరుతి.. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నది.

కర్ణాటక, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లోనూ విస్తరించాయి. వీటి ప్రభావంతో బెంగళూలో జోరుగా వానలు పడుతున్నాయి. అటు బీహార్‌, సిక్కింలకూ వ్యాపించాయి. తెలంగాణకు మాత్రం జూన్‌ 16 తర్వాతే రుతుపవనాలు వస్తాయని చెబుతున్నారు.

బలహీనంగానే రుతుపవనం

రాబోయే నాలుగు వారాలు రుతుపవనాలు బలహీనంగానే ఉండొచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ పేర్కొన్నది. ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ ప్రిడిక్షన్‌ సిస్టమ్‌ (ఈఆర్‌పీఎస్‌) ప్రకారం.. జూలై 6 వరకూ పెద్దగా పురోగతి ఉండకపోవచ్చని స్కైమెట్‌ తెలిపింది. దేశ మధ్య, పశ్చిమ ప్రాంతాలను కోర్‌ మాన్‌సూన్‌ జోన్‌గా పేర్కొంటారు.

వర్షపాతం తగ్గే కారణంగా ఈ ప్రాంతాల్లోని వ్యవసాయంపై అది పెను ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుఫాను వల్ల నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం ఆలస్యమైంది. అవి ముందుకు కదలడానికి అడ్డుకుంటున్నది కూడా తుఫానేనని స్కైమెట్‌ పేర్కొంటున్నది

Exit mobile version