Komatireddy | ఎన్నికల తర్వాతా పథకాలు మాయం: ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్‌రెడ్డి

<p>నాకు పేరొస్తదనే వెళ్లంలా ప్రాజెక్టు పనుల్లో జాప్యం సీఎం కేసీఆర్ పై ఎంపీ వెంకట్‌రెడ్డి విమర్శలు Komatireddy | విధాత : ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ సంక్షేమ పథకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రస్తుతానికి కొంతమందికే పథకాల లబ్ధి అందచేస్తున్నారని, ఎన్నికల తర్వాతా ఆ పథకాలు కొనసాగించబోడంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. గురువారం నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆయన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకం […]</p>

Komatireddy | విధాత : ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ సంక్షేమ పథకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రస్తుతానికి కొంతమందికే పథకాల లబ్ధి అందచేస్తున్నారని, ఎన్నికల తర్వాతా ఆ పథకాలు కొనసాగించబోడంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. గురువారం నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆయన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకం ఓట్ల కోసమే తెచ్చారని, ఈ పథకంలో 10లక్షలు ఇస్తే, అందులో 3లక్షలు కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. అదికూడా అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారన్నారు. అదే డబ్బులను దళితులకు ఇంటికి లక్ష లెక్క ఇస్తే దళితులందరూ బాగుపడతారన్నారు.

బీసీ బంధు కూడా ఎన్నికల తర్వాత మాయం అవుతదన్నారు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు వంటివన్ని కొందరికి ఇచ్చి ఆశచూపి ఎన్నికలైపోగానే వదిలేస్తారన్నారు. ప్రభుత్వ భూములు, అవుటర్ రింగ్ రోడ్డులను అమ్మి ఆ డబ్బుతో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని విమర్శించారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అన్యాయం చేశాడని, రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపైన ఉన్నారన్నారు. నాకు పేరు వస్తుందన్న దురుద్దేశంతో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయకుండా పదేళ్లుగా ఏడిపిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూడు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటిని అందిస్తానన్నారు.

నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు దాసరి గూడెంలో ఇండ్లు కడితే సీఎం కేసీఆర్ ప్రభుత్వం వాటిని పేదవాళ్లకు ఇవ్వకుండా అమ్ముకున్నారన్నారు. తాను స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే సీఎం కేసీఆర్ ఆయనను ఎత్తుకెళ్లాడని, కానీ ఆయన భార్య పార్వతమ్మ ఇప్పటికి మనతోనే ఉందని, కలిసి ప్రచారంలో కూడా పాల్గొన్నదన్నారు.

బీఆరెస్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా అవినీతి అక్రమాలతో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రస్తుత బీఆర్‌ఎస్‌లోని ఓ సీనియర్ నాయకుడికి 20 ఇండ్లు, 500 నుంచి 1000 ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు. నా సంపాదన మొత్తం పేదలకే ఇచ్చానని, ఆ సీనియర్ బీఆరెస్ నేత మాదిరిగా నేను కూడా డబ్బులు దాచుకుంటే వందల ఎకరాల భూములుండేవని, ఫామ్‌హౌజ్‌లు కట్టుకునేవాడినన్నారు.

Latest News