Site icon vidhaatha

Warangal: MSP ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ ముట్టడి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: SC వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్‌ను శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా ఇన్‌చార్జి ఇరుగు పైడి మాదిగ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే 100 రోజులలో వర్గీకరణ చేస్తానని అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలైనా అమలు చేయలేదని విమర్శించారు. ఇచ్చిన మాటను తప్పి మోడీ ప్రభుత్వం మాదిగ, మాదిగ ఉప కులాలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఇకనైనా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో
SC ABCD వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

మహాజన సోషలిస్ట్ పార్టీ ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ జన్ను రవి మాదిగ, ఎంఎస్పీ పార్టీ ములుగు టౌన్ అధ్యక్షుడు మరాఠీ రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా నెమలి నరసయ్య మాదిగ, వావిలాల స్వామి మాదిగ, MSP పార్టీ ములుగు జిల్లా నాయకులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version