Site icon vidhaatha

Nalgonda | రేవంత్ ర్యాలీలో వివాదం.. ఫ్లెక్సీల చించివేత! కోమటిరెడ్డి వర్గీయుల పనేనంటూ తండు వర్గీయులనిరసన

Nalgonda

విధాత: నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన తమ ఫ్లెక్సీలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు చించి వేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు తండు సైదులు గౌడ్ వర్గీయులు రేవంత్ రాకకు ముందు నిరసన దిగడం ఉద్రిక్తత రేపింది. నిరసన ర్యాలీ సభ ప్రాంతం గడియారం చౌరస్తాలో తండు సైదులు గౌడ్ తన వర్గీయులతో కలిసి రాస్తారోకోకు దిగారు.

కోమటిరెడ్డి అనుచరులు తమ ఫ్లెక్సీలు చించారని అంధోళన చేశారు. కోమటిరెడ్డి అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వెంకట్ రెడ్డి బిసిలను శత్రువులుగా చూస్తున్నాడన్నారు.

నిరుద్యోగ నిరసన ర్యాలీకి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడి గా తాను స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేశానన్నారు. నా ఎదుగుదలను జీర్ణించుకోలేని కోమటిరెడ్డి తన అనుచరులతో నా ఫ్లెక్సీలను తొలగించారని తండు సైదులు గౌడ్ ఆరోపించారు.

నలగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన తనకు సంబంధించిన ఫ్లెక్సీలను మాత్రమే ధ్వంసం చేయడం జరిగిందన్నారు. దీనిని నిరసిస్తూ బాద్యులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని తండు సైదులు గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగులవంచ లక్ష్మణరావు , విజయ్, రాజు, నరేష్, కేశవులు, యాదగిరి రెడ్డి, మహేందర్, సునీల్, సుధాకర్, నందు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version