Nalgonda | దేవాలయాలు వ్యక్తి నిర్మాణ కేంద్రాలు.. హ‌ర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ

Nalgonda విధాత: దేవాలయాలు వ్యక్తి నిర్మాణ స్ఫూర్తి కేంద్రాలని, ప్రతి ఒక్కరూ ఆలయాలను సందర్శించి ఆధ్యాత్మిక, నైతిక పరివర్తన పొందాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మునుగోడు మండలం కోతులారం గ్రామంలో శ్రీ కేదారేశ్వర ఆలయ పునర్నిర్మాణ మహోత్సవంలో దత్తాత్రేయ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఆయనకు బిజెపి సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ దేవాలయం మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. మన సమాజంలో […]

  • Publish Date - May 4, 2023 / 02:18 PM IST

Nalgonda

విధాత: దేవాలయాలు వ్యక్తి నిర్మాణ స్ఫూర్తి కేంద్రాలని, ప్రతి ఒక్కరూ ఆలయాలను సందర్శించి ఆధ్యాత్మిక, నైతిక పరివర్తన పొందాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.

మునుగోడు మండలం కోతులారం గ్రామంలో శ్రీ కేదారేశ్వర ఆలయ పునర్నిర్మాణ మహోత్సవంలో దత్తాత్రేయ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఆయనకు బిజెపి సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ దేవాలయం మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. మన సమాజంలో ఇల్లు బడి గుడి ఈ మూడు చాలా ముఖ్యమైనవన్నారు.

జీవితంలో డబ్బు ప్రధానం కాదని, డబ్బు అనేది వస్తుంటుంది వెళుతుంటుంది.. కానీ సంస్కారమే ప్రధానమైనదన్నారు. ఈ సంస్కారాన్ని భగవద్గీత, రామాయణం, మహాభారతం రూపంలో చెప్పి దేవాలయాలు వ్యక్తులను నిర్మాణం చేస్తాయన్నారు. గుడికి బడికి రాజకీయాలు లేవన్నారు.
గుడి బడి సభ్యత సంస్కారం అనేది శాశ్వతమైనవన్నారు.

Latest News