Narayana College | మాదాపూర్.. నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య
Narayana College విధాత: మాదాపూర్ లోని నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అయ్యప్ప సొసైటీ లోని నారాయణ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న గంటా కనక రాజు క్యాంపస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కనకరాజు ఈ నెల 8 వ తేదీన కళాశాలలో చేరారు. ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులను విషాదానికి గురి చేసింది. కనక రాజు మృతి పై పోలీసులు కేసు […]

Narayana College
విధాత: మాదాపూర్ లోని నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అయ్యప్ప సొసైటీ లోని నారాయణ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న గంటా కనక రాజు క్యాంపస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కనకరాజు ఈ నెల 8 వ తేదీన కళాశాలలో చేరారు. ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులను విషాదానికి గురి చేసింది. కనక రాజు మృతి పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.