Nayan Vignesh |విధాత: సినీ నటి నయనతార, విఘ్నేశ్ శివన్ తమ అభిమానులకు శుభవార్త వినిపించారు. నయనతార కవల పిల్లలకు జన్మినిచ్చినట్లు విఘ్నేశ్ శివన్ తెలిపారు. ఈ దంపతులకు పండంటి మగబిడ్డలకు జన్మించారు. దీంతో తాము తల్లిదండ్రులమైనట్టు సోషల్ మీడియా వేదికగా ఆ దంపతులు ప్రకటించి ఆనందం వ్యక్తం చేశారు. న
యనతార దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, ఇతరులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దసరా కానుకగా వచ్చిన గాడ్ ఫాదర్ మూవీతో మంచి విజయాన్ని అందుకుంది నయనతార.
సుమారు 7 ఏండ్ల పాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. మహాబలిపురంలో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది.
నయన్ విఘ్నేశ్ పెళ్లి డాక్యుమెంటరీ త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. నయనతార.. బియాండ్ ది ఫెయిరీటేల్ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ డాక్యుమెంటరీ కోసం వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే కవలలకు జన్మనిచ్చి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు నయన్ విఘ్నేశ్.