Site icon vidhaatha

Nirmala Sitharaman | సింపుల్‌గా.. నిర్మ‌లా సీతారామ‌న్‌ కుమార్తె వివాహం

విధాత‌: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె పరకాల వాంజ్ఞ్మ‌యి వివాహం గురువారం బెంగళూరులో సింపుల్‌గా జరిగింది. కేవ‌లం కొద్ది మంది స‌న్నిహితులు, స్నేహితులు, బంధువుల మ‌ధ్య వివాహ క్ర‌తువు పూర్త‌యింది.

బెంగ‌ళూరులోని ఉడిపి అడమారు మఠ్‌కు చెందిన పురోహితులు బ్రాహ్మణ సంప్రదాయ పద్దతిలో పరకాల వాంజ్ఞ్మ‌యి, ప్రతీక్ దోషిల వివాహం జ‌రిపించారు. వివాహ‌ వీడియో షోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బిడ్జ జ‌ర్న‌లిస్టు

నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల ఏకైక కుమార్తె వాంజ్ఞ్మ‌యి.. ప్రస్తుతం మింట్ లాంజ్ ఫీచర్స్ విభాగంలోని బుక్స్ అండ్ కల్చర్ సెక్షన్‌లో ఉద్యోగిగా ఉన్నారు. అంతకు ముందు ది హిందూలో జ‌ర్న‌లిస్టుగా ఫీచ‌ర్స్ రాసేవారు. ఆమె నార్త్‌వెస్ట్రన్ మెడిల్లి స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.

Exit mobile version