Site icon vidhaatha

NTR Coin | ఎన్టీఆర్ నాణెం ఎక్క‌డ కొనుగోలు చేయాలి.. దాని ధ‌ర ఎంత‌?

NTR Coin |

దివ‌గంత ముఖ్య‌మంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు పుట్టి ఈ ఏడాదితో 100 ఏళ్ళు పూర్తి అయిన సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాలని కుటుంబ స‌భ్యులు ఘ‌నంగా నిర్వ‌హించారు.ఇక ఇదే సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఎన్టీఆర్ పేరు మీద వంద రూపాయ‌ల నాణాన్ని విడుద‌ల చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుద‌ల చేయ‌గా, ఈ కార్యక్ర‌మంలో ఎన్టీఆర్ కుటుంబానికి సంబ‌ధించి దాదాపు 200 మంది హాజ‌రయ్యారు.

తెలుగు సినిమాకి ఎన్టీఆర్ చేసిన సేవల్ని స్మరించుకున్న రాష్ట్రపతి.. రాముడు, శ్రీకృష్ణుడు ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారని ఆమె ప్ర‌శంస‌లు కురిపించారు. ఎన్టీఆర్… సీనీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎనలేని సేవలు అందించారని కూడా ద్రౌపది ముర్ము పొగ‌డ్త‌లు కురిపించారు.

అయితే ఎన్టీఆర్ నాణెం విడుద‌లైన త‌ర్వాత దీనిని కొనుగోలు చేయాల‌ని కొంద‌రు భావిస్తున్నారు. అది ఎక్క‌డ ల‌భ్యం అవుతుంది, దాని ధర ఎంత అనే విష‌యాల‌పై పూర్తి క్లారిటీ లేక‌పోవ‌డంతో అంతటా తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ నాణేలను హైదరాబాద్‌లోని సైఫా బాద్ మింట్ కౌంటర్‌ నుంచి కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది.

అలానే వాటిని ఆన్‌లైన్ ద్వారా కూడా ఆర్డ‌ర్ చేసుకునే వెసులు బాటు ఉంది. ఇక ఆర్డ‌ర్ చేసిన త‌ర్వాత వీటిని ప‌సుపు క‌ల‌ర్ బాక్స్‌లో ప్యాక్ చేసి ఇస్తారు. ఈ నాణెం ధ‌ర‌ని అక్షరాల 4,850 రూపాయలుగా నిర్ణ‌యించారు. ఇక ఈ నాణెం 100 శాతం లోహాలతో తయారు చేయగా, ఇందులో 50 శాతం సిల్వర్, 40 శాతం కాపర్ మిగతా 5, 5 శాతాల్లో నికెల్ జింక్ లోహాలతో ఉంటుంద‌ట‌..

నాణెంపై ఓ వైపు మూడు సింహాల‌తో పాటు అశోక చక్రం ఉంటుంది. మ‌రోవైపు ఎన్టీఆర్ చిత్రం ఉండ‌గా, దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో రాసి ఉంది. అలానే 1923- 2023 అని కూడా ముద్రించారు.అయితే ఈ నాణెంపై ఎన్టీఆర్ రూపాన్ని వారి కుటుంబ స‌భ్యులే సెల‌క్ట్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. తెలుగువారికి ఇంత‌టి గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version