ఆక్టోబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా 19న విడుదల
విధాత : ఆక్టోబర్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల కోటా ఈ నె 19న ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లుగా టీటీడీ వెల్లడించింది. ఆర్జిత సేవల టికెట్ల లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 21న ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
కల్యాణోత్సం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈను 22న ఉదయం 10గంటలకు కేటాయిస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు. 23వ తేదీన ఉదయం 10గంటలకు అంగప్రదక్షిణం, 11గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ కోటా, మధ్యాహ్నం 3గంటలకు వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
24వ తేదీన ఉదయం 10గంటలకు రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటా అందుబాటులో ఉంచుతారు. భక్తులు https://ttdevasthnams.ap.gov.in వెబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
TTD October 2025 Quota Release Schedule is here!
Plan your darshan and seva in advance:
•Electronic DIP
•Arjitha & Virtual Sevas
•Senior Citizens Darshan
•Special Entry Tickets
•Accommodation & More#TTD #Tirumala #SrivariDarshan #TTDSeva #QuotaRelease pic.twitter.com/OCjrLELyFY— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) July 15, 2025