Pregnant Girl | 12 ఏండ్ల చిన్నారికి పాప పుట్టింది.. త‌ల్లీబిడ్డ‌ల ప‌రిస్థితి విష‌మం..

Pregnant Girl | ఓ 12 ఏండ్ల చిన్నారి త‌న‌కు తెలియ‌కుండానే గ‌ర్భం దాల్చింది. క‌డుపు నొప్పిగా ఉంద‌ని ఆస్ప‌త్రికి వెళ్తే.. గ‌ర్భం ధ‌రించిన‌ట్లు తేలింది. అనంత‌రం ఆ చిన్నారికి ప్ర‌స‌వం చేశారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ జిల్లా ఫ‌గ్వారా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఫ‌గ్వారా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో 12 ఏండ్ల బాలిక త‌న తండ్రితో క‌లిసి ఉంటోంది. త‌ల్లి కొన్నాళ్ల క్రిత‌మే వీరిని వ‌దిలి వెళ్లిపోయింది. అయితే […]

  • Publish Date - May 28, 2023 / 06:44 AM IST

Pregnant Girl | ఓ 12 ఏండ్ల చిన్నారి త‌న‌కు తెలియ‌కుండానే గ‌ర్భం దాల్చింది. క‌డుపు నొప్పిగా ఉంద‌ని ఆస్ప‌త్రికి వెళ్తే.. గ‌ర్భం ధ‌రించిన‌ట్లు తేలింది. అనంత‌రం ఆ చిన్నారికి ప్ర‌స‌వం చేశారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ జిల్లా ఫ‌గ్వారా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఫ‌గ్వారా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో 12 ఏండ్ల బాలిక త‌న తండ్రితో క‌లిసి ఉంటోంది. త‌ల్లి కొన్నాళ్ల క్రిత‌మే వీరిని వ‌దిలి వెళ్లిపోయింది. అయితే బాలిక ఇంట్లోనే ఉంటూ తండ్రికి వంట చేసి పెట్ట‌డం, ఇత‌ర ప‌నులు చేసేది. అయితే గ‌త ఆరేడు నెలల నుంచి ఆమె క‌డుపు నొప్పితో బాధ‌ ప‌డుతోంది. క‌డుపులో నొప్పి వ‌చ్చినప్పుడ‌ల్లా తండ్రి మందులు తీసుకొచ్చి ఇస్తే వాటిని వేసుకునేది.

ఇటీవ‌ల భ‌రించ‌లేని క‌డుపు నొప్పి రావ‌డంతో.. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో గురునాన‌క్ దేవ్ ఆస్ప‌త్రికి తండ్రీ కూతురు వెళ్లారు. అక్క‌డ చిన్నారికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా గ‌ర్భిణి అని తేలింది. దీంతో బాలిక‌కు ప్ర‌స‌వం చేసి.. 800 గ్రాముల బ‌రువున్న పాప‌ను బ‌య‌ట‌కు తీశారు. త‌ల్లీబిడ్డ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు.

ఏం జ‌రిగిందంటే..?

బాలిక గ‌ర్భం దాల్చ‌డానికి గ‌ల కార‌ణాల‌పై వైద్యులు ఆమెను ప్ర‌శ్నించారు. ఏడు నెల‌ల క్రితం బ‌హిర్భుమికి వెళ్లిన‌ప్పుడు త‌న‌పై అత్యాచారం జ‌రిగింద‌ని తెలిపింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే చంపేస్తాన‌ని బెదిరించ‌డంతో ఎవ‌రికీ చెప్ప‌లేక‌ పోయాన‌ని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు త్వ‌ర‌లోనే నిందితుడిని అరెస్టు చేస్తామ‌ని తెలిపారు.

Latest News