Site icon vidhaatha

Priyanka Gandhi | మెదక్‌ నుంచి ప్రియాంక పోటీ? గతంలో ఎంపీగా ఇందిర ప్రాతినిథ్యం

Priyanka Gandhi |

విధాత: ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీని తెలంగాణలోని మెదక్‌ స్థానం లోక్‌సభకు నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని టీపీసీసీ ఇంటలెక్చువల్ సెల్ చైర్మన్ శ్యామ్ మోహన్ తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ను కోరుతున్నామన్నారు.

శుక్రవారం గాంధీ భవన్‌లో ఇంటలెక్చువల్‌ సెల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్‌ మోహన్‌ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలి? అనే అంశంపై ప్రధానంగా చర్చించామని తెలిపారు.

మదీనా సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని, తప్పకుండా తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది ప్రజలను ఉద్దేశించి ఉంటుందన్నారు. ప్రతి రంగం నుండి మేధావులు కాంగ్రెస్ పార్టీలోకి రావటం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. చాలా మంది మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఉత్సాహ పడుతున్నారన్నారు.

Exit mobile version