Rahul Gandhi | కూర‌గాయ‌లు అమ్మే వ్య‌క్తితో.. రాహుల్ గాంధీ భోజ‌నం

Rahul Gandhi | మొన్న హ‌ర్యానా మ‌హిళ రైతులను ఇంటికి పిలిపించుకుని, వారి క‌ష్టాల‌ను తెలుసుకున్న రాహుల్ గాంధీ.. నిన్న కూర‌గాయ‌లు అమ్మే వ్య‌క్తిని త‌న ఇంటికి ఆహ్వానించారు. ఆ వ్య‌క్తితో క‌లిసి రాహుల్ భోజ‌నం చేశారు. అత‌ని క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా తాను ప‌డుతున్న క‌ష్టాల గురించి రామేశ్వ‌ర్ అనే కూర‌గాయ‌ల విక్రేత మాట్లాడిన వీడియో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. రామేశ్వ‌ర్ వీడియోను రాహుల్ గాంధీ త‌న […]

  • By: raj    latest    Aug 15, 2023 1:55 AM IST
Rahul Gandhi | కూర‌గాయ‌లు అమ్మే వ్య‌క్తితో.. రాహుల్ గాంధీ భోజ‌నం

Rahul Gandhi | మొన్న హ‌ర్యానా మ‌హిళ రైతులను ఇంటికి పిలిపించుకుని, వారి క‌ష్టాల‌ను తెలుసుకున్న రాహుల్ గాంధీ.. నిన్న కూర‌గాయ‌లు అమ్మే వ్య‌క్తిని త‌న ఇంటికి ఆహ్వానించారు. ఆ వ్య‌క్తితో క‌లిసి రాహుల్ భోజ‌నం చేశారు. అత‌ని క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా తాను ప‌డుతున్న క‌ష్టాల గురించి రామేశ్వ‌ర్ అనే కూర‌గాయ‌ల విక్రేత మాట్లాడిన వీడియో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. రామేశ్వ‌ర్ వీడియోను రాహుల్ గాంధీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసి.. సామాన్యులు ప‌డుతున్న క‌ష్టాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యం విదిత‌మే.

మొత్తానికి ఆ వ్య‌క్తిని త‌న ఇంటికి పిలిపించుకుని భోజ‌నం చేశారు. ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫోటోల‌ను రాహుల్ ట్వీట్ చేశారు. రామేశ్వ‌ర్ జీ ఉల్లాస‌వంత‌మైన వ్య‌క్తి. ఆయ‌నలో కోట్లాది మంది భార‌తీయుల స్నేహ‌పూర్వ‌క స్వ‌భావం క‌నిపించింది. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో సైతం చిరున‌వ్వుతో ముందుకు సాగేవారు నిజ‌మైన భార‌త భాగ్య విధాత‌లు అని రాహుల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

రామేశ్వ‌ర్ వీడియోలో ఏం చెప్పారంటే.. ట‌మాటా ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో వాటిని కొన‌లేక‌పోయాను. ఇత‌ర కూర‌గాయ‌లు సైతం కొన‌లేని దుస్థితిలో ఉన్నానని చెబుతూ క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియోను రాహుల్ స‌హా ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ట్వీట్ చేశారు.